రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్ రవాణా చేసుకున్నామన్నారు
రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్ రవాణా చేసుకున్నామన్నారు.
తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైన అన్ని జిల్లాలకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తున్నామని ఈటల రాజేందర్ వెల్లడించారు. రోజుకు 400 టన్నుల ఆక్సిజన్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని.. ప్రస్తుతం రోజుకు 270 టన్నుల ఆక్సిజన్ అవసరమని మంత్రి పేర్కొన్నారు.
ఆక్సిజన్ పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారుల నియమించామని.. 5.76 లక్షల లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నామని ఈటల రాజేందర్ వెల్లడించారు. పీఎం కేర్ నుంచి 5 ఆక్సిజన్ మెషీన్లు వచ్చాయని... యుద్ధ ప్రాతిపదికన 3,010 బెడ్లు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
Also Read:25 రోజుల్లో 341 మంది మృతి: హైకోర్టుకు తెలంగాణ సర్కార్ నివేదిక
పది వేల బెడ్‌లకు ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటు చేశామని.. ఇతర రాష్ట్రాల వారితో 50 శాతం బెడ్లు నిండిపోయామని రాజేందర్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల వారికి మానవతా దృక్పథంతో చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు.
ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తున్నామని... నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో 350 ఆక్సిజన్ బెడ్లు వున్నాయని మంత్రి పేర్కొన్నారు. గాంధీలో 1,400 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో వున్నాయని రాజేందర్ చెప్పారు.
వారం పది రోజుల్లో అందుబాటులోకి అదనంగా 3,500 ఆక్సిజన్ బెడ్లు వుంటాయని ఆయన పేర్కొన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌కు రూ.500 మాత్రమే వసూలు చేయాలని రాజేందర్ పేర్కొన్నారు. ఇంటి దగ్గరకు వచ్చి టెస్ట్ చేస్తే రూ.750 తీసుకోవాలని మంత్రి వెల్లడించారు.