అన్ని భవిష్యత్తులోనే చేస్తారా?..: కరోనాపై తెలంగాణ ప్రభుత్వ నివేదికపై హైకోర్టు ఆగ్రహం

By narsimha lodeFirst Published Jun 1, 2021, 2:02 PM IST
Highlights

కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఈ విషయమై రేపు హెల్త్ సెక్రటరీ, డీహెచ్, డీజీపీలు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
 

హైదరాబాద్:కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ఈ విషయమై రేపు హెల్త్ సెక్రటరీ, డీహెచ్, డీజీపీలు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.తెలంగాణలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున  డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ హైకోర్టుకు కరోనా కేసులపై నివేదికను సమర్పించారు. ఈ నివేదికపై  హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది.తాము ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని హైకోర్టు ఆగ్హం వ్యక్తం చేసింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు వసూలు చేసే ఛార్జీలపై కొత్త జీవోను ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నించింది. కరోనాపై సలహా కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని కోరింది. 

also read:థర్ద్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్దం: కరోనాపై హైకోర్టుకు కేసీఆర్ సర్కార్ నివేదిక

తాము అడిగిన ఏ ఒక్క అంశానికి కూడ సరైన సమాధానం ఇవ్వలేదని ప్రభుత్వం తీరుపై హైకోర్టు మండిపడింది.మహారాష్ట్రలో 8 వేల మంది చిన్నారులకు కరోనా సోకిన విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. థర్డ్ వేవ్ కి ఎలా సన్నద్దమయ్యారని ప్రశ్నించింది హైకోర్టు. అన్ని భవిష్యత్తులోనే చేస్తారా? .. ఇప్పుడేం చేయలేరా అని హైకోర్టు అడిగింది.లైసెన్స్ రద్దు చేసిన ఆసుపత్రులు బాధితులకు సొమ్ము తిరిగి ఇచ్చారా అని హైకోర్టు ప్రశ్నించింది.బబంగారం తాకట్టు పెట్టి ఆసుపత్రుల్లో ఫీజులు చెల్లిస్తున్నారని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. హైకోర్టు ప్రశ్నలకు అడ్వకేట్ జనరల్ సమయం కోరారు.

రేపు హెల్త్ సెక్రటరీ, డీహెచ్, డీజీపీలు హైకోర్టుకు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం తరపున వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు నివేదికను కోర్టుకు సమర్పించారు. కరోనాకు సంబందించిన పరిస్థితులపై నమోదైన కేసులకు సంబంధించి డీజీపీ మరో రిపోర్టును కూడ కోర్టుకు అందించారు.
 

click me!