సడెన్‌గా లాక్‌డౌన్ విధిస్తే ఎలా: తెలంగాణ హైకోర్టు ప్రశ్న

By narsimha lodeFirst Published May 11, 2021, 3:46 PM IST
Highlights

సడెన్‌గా లాక్‌డౌన్  విధిస్తే ఎలా అని  తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల ప్రజలు తమ ప్రాంతాలకు ఎలా వెళ్తారని ఉన్నత న్యాయస్థానం అడిగింది.
 

హైదరాబాద్: సడెన్‌గా లాక్‌డౌన్  విధిస్తే ఎలా అని  తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల ప్రజలు తమ ప్రాంతాలకు ఎలా వెళ్తారని ఉన్నత న్యాయస్థానం అడిగింది.కరోనాపై  మంగళవారం నాడు మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ ప్రారంభించిన తర్వాత హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రేపటి నుండి రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకురావడంతో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

also read:రేపటివరకు ఎన్ని ప్రాణాలు పోవాలి: అంబులెన్స్‌ల నిలిపివేతపై హైకోర్టు వ్యాఖ్యలు

రేపటి నుండి లాక్‌డౌన్ అంటే ఇతర రాష్ట్రాల ప్రజల పరిస్థితి ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు మీకు కనీసం వీకేండ్ లాక్‌డౌన్ ఆలోచన లేదని హైకోర్టు గుర్తు చేసింది. గత ఏడాదిలో వలసకూలీలు పడిన ఇబ్బందులు ఈ దఫా ఎవరూ కూడ పడొద్దని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.  రోజూవారీ కూలి చేస్తూ బతికేవాళ్లు, వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని హైకోర్టు  ప్రశ్నించింది.  రెండో డోస్ వ్యాక్సిన్ పై ప్రజల్లో అయోమయం నెలకొందన్నారు. 

click me!