ఆ వర్గం కోసమే కేసీఆర్ సర్కార్: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 11, 2021, 02:49 PM IST
ఆ వర్గం కోసమే కేసీఆర్ సర్కార్: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మరణాలు, కేసులను తగ్గించి చూపిస్తోందని ఆరోపించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మరణాలు, కేసులను తగ్గించి చూపిస్తోందని ఆరోపించారు.

వాస్తవ నివేదికలు ఇవ్వకపోవడం వలన తెలంగాణ.. కేంద్రం నుంచి సహాయం పొందలేకపోతోందన్నారు. ప్రధాని మోడీకి సలహాలిచ్చానని కేసీఆర్ చెప్పుకోవటం సిగ్గుచేటని సంజయ్ ఎద్దేవా చేశారు.

అంతర్గత సమావేశ విషయాలు బయటకు చెప్పటం సరైనది కాదని... రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఏమి చేసిందో ప్రజలకు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కింగ్ కోఠి ఆసుపత్రిలో కరోనా రోగుల మరణాలకు కారకులు ఎవరని సంజయ్ ప్రశ్నించారు.

Also Read:తెలంగాణలో రేపటి నుంచే లాక్ డౌన్: నాలుగు గంటలే మినహాయింపు

తెలంగాణలో పరిస్థితి అదుపు తప్పిందని, కరోనాతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కాపాడే నిర్ణయాలు తీసుకుంటే తాము తప్పకుండా సహకరిస్తామని సంజయ్ స్పష్టం చేశారు. రంజాన్ పండుగకు ఇచ్చే ప్రాధ్యాన్యత ప్రజల ప్రాణాలకు కేసీఆర్ ఇవ్వటం లేదని ఆయన విమర్శించారు.

ఓల్డ్ సిటీలో నైట్ కర్ఫ్యూ అమలు కావటం లేదని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక్క వర్గం కోసమే పనిచేస్తోందని, నిఖార్సైన హిందువునని చెప్పుకునే  కేసీఆర్ ఎందుకు మరో వర్గానికి మద్దతు ఇస్తున్నారని సంజయ్ నిలదీశారు.

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?