కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు: మంత్రి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు

By narsimha lode  |  First Published Aug 1, 2023, 1:06 PM IST

తెలంగాణ హైకోర్టులో  మంత్రి కొప్పుల ఈశ్వర్ కు  చుక్కెదురైంది.  తన ఎన్నిక చెల్లదని  దాఖలైన పిటిషన్ ను కొట్టివేయాలని మంత్రి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.


హైదరాబాద్: తెలంగాణ మంత్రి  కొప్పుల ఈశ్వర్ కు  మంగళవారంనాడు  హైకోర్టులో  చుక్కెదురైంది.  తన  ఎన్నిక చెల్లదని  మంత్రి ఈశ్వర్ దాఖలు చేసిన పిటిషన్ ను  తెలంగాణ హైకోర్టు  కొట్టివేసింది.2018  అసెంబ్లీ ఎన్నికల సమయంలో  ధర్మపురి అసెంబ్లీ స్థానం నుండి కొప్పుల ఈశ్వర్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై 418 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  

కొప్పుల ఈశ్వర్ విజయం సాధించినట్టుగా రిటర్నింగ్ అధికారి  ప్రకటించారు. అయితే ఈ విషయమై  కాంగ్రెస్ అభ్యర్థి  లక్ష్మణ్ కుమార్  తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.    కొప్పుల ఈశ్వర్  అక్రమ పద్దతుల్లో  విజయం సాధించారని లక్ష్మణ్ తన పిటిషన్ లో ఆరోపించారు.  ఈ పిటిషన్ పై  హైకోర్టులో విచారణ సాగుతుంది.  అయితే  ఈ సమయంలో  తనపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేయాలని  మంత్రి కొప్పుల ఈశ్వర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.మూడేళ్ల పాటు విచారణ నిర్వహించి అడ్వకేట్ కమిషన్ ముందు  వాదనలు ముగిసిన తర్వాత  ఇప్పుడు ఎలా సాధ్యమౌతుందని  హైకోర్టు ప్రశ్నించింది.

Latest Videos

కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి లక్ష్మణ్ కుమార్ దాఖలు  చేసిన పిటిషన్ పై తుది వాదనలు వినాల్సి ఉంటుందని  హైకోర్టు తెలిపింది.తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.2018 ఎన్నికల కౌంటింగ్ లో  వీవీపాట్ స్లిప్పుల్లో  తేడాలున్నాయని, రీ కౌంటింగ్ కు ఆదేశాలివ్వాలని కూడ లక్ష్మణ్ కుమార్ ఆ పిటిషన్ లో హైకోర్టును కోరారు.  ఈ విషయమై  ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత  వాంగ్మూలం రికార్డు చేసేందుకు  జగిత్యాల జిల్లా జడ్జిగా పనిచేసిన  ఎన్‌వీవీ  నాతారెడ్డిని అడ్వకేట్ కమిషనర్ గా నియమించింది. ఈ ఏడాది జూలై 1వ తేదీన మంత్రి కొప్పుల ఈశ్వర్  అడ్వకేట్ కమిషన్ ముందు  హాజరయ్యారు. 
 


 


 

click me!