డ్రగ్స్ కేసులో తెలంగాణ హైకోర్టులో సినీ నటుడు నవదీప్ నకు చుక్కెదురైంది. నవదీప్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్‌నకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. నవదీప్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.41 ఏ సెక్షన్ కింద నవదీప్ నకు నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. డ్రగ్స్ కేసు నుండి ఊరట కల్గించాలని నవదీప్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ ను అరెస్ట్ చేయవద్దని ఇటీవలనే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరో వైపు ఈ కేసులో నిన్న హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. దరిమిలా తెలంగాణ హైకోర్టులో నవదీప్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలను హైకోర్టు విన్నది.
హీరో నవదీప్ పై గతంలో కూడ కొన్ని కేసులున్నాయని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనలను హీరో నవదీప్ న్యాయవాది తోసిపుచ్చారు. నవదీప్ పై ఏ కేసులోనూ దోషిగా తేలలేదని నవదీప్ న్యాయవాది చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత నవదీప్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ నకు 41 ఏ సెక్షన్ కింద నోటీసు ఇచ్చి విచారణ జరపాలని కోరింది.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను 29వ నిందితుడిగా పోలీసులు చేర్చారు.మాదాపూర్ ప్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో హీరో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు.ఈ ఆరోపణలను నవదీప్ తోసిపుచ్చుతున్నారు. డ్రగ్స్ కేసు ఎప్పుడూ తెరమీదికి వచ్చినా తన పేరును చేర్చుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. హీరో నవదీప్ పరారీలో ఉన్నట్టుగా స్యయంగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. అయితే తాను ఎక్కడికి పారిపోలేదని హీరో నవదీప్ ప్రకటించారు. వెంటనే ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 19వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ గడువు తీరడంతో నిన్న నవదీప్ నివాసంలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో మరో పిటిషన్ ను దాఖలు చేశారు హీరో నవదీప్.ఈ పిటిషన్ ను విచారణను ఇవాళ ముగించింది హైకోర్టు. నోటీసిచ్చి నవదీప్ ను విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.