దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: విచారణను వాయిదా వేసిన హైకోర్టు

By Siva KodatiFirst Published Dec 9, 2019, 3:13 PM IST
Highlights

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. శుక్రవారం వరకు గాంధీలోనే మృతదేహాలు భద్రపరచాలని స్పష్టం చేసింది కోర్టు.

సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం సీనియర్ న్యాయవాది ప్రకాశ్ రెడ్డిని మధ్యవర్తిగా సూచనలు ఇవ్వాలని సూచింది. సుప్రీంకోర్టులో బుధవారం జరిగే విచారణలో ఏం తేలుతుందో చూసి గురువారం నాడు ఈ విచారణ జరపనుంది.

Also Read:దిశ నిందితుల ఎన్ కౌంటర్... భయంతో ఉరివేసుకున్నాడు..

ఆ లోగా ఎఫ్ఐఆర్ కాపీలు, డాక్యుమెంట్లు, సీడీలు, పోస్ట్‌మార్టం నిర్వహించిన దానికి సంబంధించిన సీడీలను తమకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం నలుగురు నిందితుల మృతదేహాలు ప్రస్తుతం మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలోనే ఉన్నాయి.

మరోవైపు దిశ కేసులో ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు కమీషన్ ముందు హాజరయ్యారు. ఎన్‌కౌంటర్ తర్వాత రెవెన్యూ అధికారులు చటాన్‌పల్లి ఘటనాస్థలంలో పంచనామా నిర్వహించారు. విచారణలో భాగంగా పంచనామా వివరాలను కమీషన్ బృందం అడిగి తెలుసుకుంటోంది. 

Also Read:నా భర్తను చంపిన వారిని వదలను: చెన్నకేశవులు భార్య

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసి, ఎన్‌కౌంటర్‌పై పూర్తి స్థాయి విచారణ జరపాని ఆదేశించింది. 

click me!