కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి... కనిపించని ఆనియన్ సమోసా

By telugu teamFirst Published Dec 9, 2019, 11:21 AM IST
Highlights

మార్కెట్లో ఉల్లిపాయలు నాలుగు రకాల గ్రేడ్ల పేర్లతో అమ్ముతున్నారు. మంచి క్వాలిటీ ఉల్లిపాయలను ఏ1 కెటగిరీ కింద అమ్ముతున్నారు. వీటి ధర రూ. 150 నుంచి రూ.170 దాకా ఉంది. ఇక గ్రేడ్ 2 ఉల్లిపాయల ధర రూ.90 నుంచి రూ.130 దాకా పలుకుతోంది. ఇక  గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉల్లిపాయల నాణ్యత కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే వాటిని కాస్త తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

ప్రస్తుతం ఉల్లి ఘాటుకి ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. కేజీ ఉల్లిపాయలు కొనాలంటే వినియోగదారుడి జేబుకి చిల్లు పడాల్సిందే. ప్రస్తుం ఉల్లి ధర అలా ఉంది మరి. ఈ ఉల్లిపాయల ధర కారణంగా... చాలా మంది ఫుడ్డీస్.. ఇబ్బందిపడుతున్నారట. దేని కోసమో తెలుసా... ఆనియన్ సమోసా. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఆనియన్ సమోసా చాలా ఫేమస్. వాటిని ఇష్టంగా లాగించేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే... ఉల్లి రేటు పెరిగిన నాటి నుంచి ఆయా బేకరీలు, రెస్టారెంట్ లలో ఉల్లికనిపించడం లేదట. 

Also Read:  వామ్మో ఉల్లి... కిలో ధర రూ.200!

దీంతో.. ఆనియన్ సమోసా ప్రియులంతా దానిపై బెంగపెట్టుకుంటున్నారంటే అతిశయోక్తి లేదు. చక్కగా... రూ.10కే సమోసా దొరికేది. అది తింటే.. కడుపు నిండిన తృప్తి కలిగేది. కానీ ఉల్లి ధర ఆకాశాన్నంటుతుండటంతో..  సదరు బేకరీ, రెస్టారెంట్  యజమానులు కూడా వాటిని తయారు చేయాలంటేనే భయపడిపోతున్నారు. దీంతో... ప్రస్తుతం నగరంలో ఆనియన్ సమోసా కొరత ఏర్పడింది.

మార్కెట్లో ఉల్లిపాయలు నాలుగు రకాల గ్రేడ్ల పేర్లతో అమ్ముతున్నారు. మంచి క్వాలిటీ ఉల్లిపాయలను ఏ1 కెటగిరీ కింద అమ్ముతున్నారు. వీటి ధర రూ. 150 నుంచి రూ.170 దాకా ఉంది. ఇక గ్రేడ్ 2 ఉల్లిపాయల ధర రూ.90 నుంచి రూ.130 దాకా పలుకుతోంది. ఇక  గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉల్లిపాయల నాణ్యత కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే వాటిని కాస్త తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

"

గత నెల నవంబర్ మొదటి వారంలో దాదాపు 7వేల క్వింటాళ్ల ఉల్లిపాయలు కొనుగోలు చేస్తే... భారీ ధర కారణంగా ఈ నెలలో కనీసం 1200 క్వింటాళ్ల ఉల్లి కూడా కొనుగోలు కావడం లేదని చెబుతుండటం గమనార్హం.

ఇదిలా ఉంటే... సికింద్రాబాద్ లో రియో అనే ఓ రెస్టారెంట్ ఉంది. అందులో సమోసాలు చాలా ఫేమస్. ప్యాట్నీ క్రాస్ రోడ్డు  ప్రాంతంలో ఉండే ఈ సమోసా స్టోర్ వద్ద ఎప్పుడూ కిటకిటలాడుతూ కనిపించేది. అయితే... ఇప్పుడు అక్కడ కూడా ఆనియన్ సమోసా దొరకడం లేదు. చాలా మంది అక్కడి సమోసా రుచికి  అలవాటు పడి ఆర్డర్ చేస్తే.. ఆనియన్ సమోసాకు బదులు ఆలూ సమోసా ఇచ్చారట. దీంతో వాళ్లు చాలా డిస్సపాయింట్ అయ్యారు.

ఇక క్లాక్ టవర్ వద్ద ఉన్న గార్డెన్ రెస్టారెంట్ లోనూ ఆనియన్ సమోసా అమ్మడం లేదు. ఆనియన్ కి బదులు ఇతర కూరగాయలతో సమోసాలు తయారు చేసి అమ్ముతున్నారు.  ఇక ఎస్ఆర్ నగర్ లోని చాయ్ అండ్ సమోసాలో మాత్రం ఈఆనియన్ సమోసా లభిస్తున్నాయట. సాధారణంగా అక్కడ రెండు సమోసా రూ.15. అయితే.. ఆనియన్ ధర ఆకాశాన్ని అంటడంతో.. దాని ధరను రూ.30 చేశారు.  మళ్లీ ఆనియన్ ధర సాధారణం కాగానే.. ధర తగ్గిస్తామని సదరు హోటల్ వాళ్లు చెబుతుండటం విశేషం. 

click me!