12 మంది ఆలిండియా సర్వీస్ అధికారుల కేడర్ కేటాయింపు:విచారణ ఈ నెల 27కి వాయిదా

By narsimha lode  |  First Published Jan 20, 2023, 10:50 AM IST

12 మంది ఆలిండియా అధికారుల  కేడర్ కేటాయింపు  విషయమై విచారణను  ఈ నెల  27వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.  


హైదరాబాద్: 12 మంది ఆలిండియా అధికారుల కేడర్ కేటాయింపుపై  విచారణను తెలంగాణ హైకోర్టు  ఈ నెల  27వ తేదీకి వాయిదా వేసింది.  ఈ కేసును రెగ్యులర్ ధర్మాసనం  విచారిస్తుందని  హైకోర్టు స్పష్టం చేసింది. మరో వైపు  వ్యక్తిగత వాదనలు విన్పిస్తామని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. 

ఈ 12 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారుల  కేడర్ కేటాయింపుపై  కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ ను ఇవాళ హైకోర్టు విచారించింది. రెగ్యులర్ బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ చేయనుందని హైకోర్టు తేల్చి చెప్పింది.  దీంతో  విచారణను ఈ నెల  27కి వాయిదా వేసింది. 

Latest Videos

2014లో  రాష్ట్ర విభజన సమయంలో  తమ కేగడర్ కేటాయింపులను  సవాల్ చేస్తూ  12 మంది  ఆలిండియా సర్వీసెస్ అధికారులు  తెలంగాణలో  కొనసాగుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాటైన  12 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులు  క్యాట్ ను ఆశ్రయించారు. దీంతో  ఈ  12 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులకు అనుకూలంగా క్యాట్ తీర్పును ఇచ్చింది.  క్యాట్ తీర్పు ఆధారంగా  12 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులు తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు.  అయితే  క్యాట్ తీర్పును తెలంగాణ హైకోర్టులో  కేంద్ర ప్రభుత్వం సవాల్ చేసింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ఈ నెల 27న  తెలంగాణ హైకోర్టు రెడ్యులర్ బెంచీ విచారణ చేయనుంది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.

also read:12 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారుల కేడర్ కేటాయింపు: నేడు తెలంగాణ హైకోర్టు విచారణ

క్యాట్ తీర్పు ఆధారంగా  ఐపిఎస్ లు అంజనీ కుమార్,అభిలాష్ భిస్త్, సంతోష్ మెహ్రా, ఏవీ రంగనాధ్ లు  తెలంగాణలో కొనసాగుతున్నారు.  మరో వైపు ఈ తీర్పు ప్రకారంగా  ఐఎఎస్ అధికారులు  వాణి ప్రసాద్, హరికిరణ్, వాకాటి కరుణ, రోనాల్డ్ రొస్, ,ఆనంతరాము, శ్రీజన,శివశంకర్, మల్లెల ప్రశాంతిలు తెలంగాణ రాష్ట్రంలోనే విధులు నిర్వహిస్తున్నారు

click me!