ప్రతి ఆసుపత్రిలో డెలీవరీతో పాటు ఇతర ఎమర్జెన్సీ కేసులకు వైద్యం చేయాలని తెలంగాణ హైకోర్టుప్రభుత్వాన్ని ఆదేశించింది. గద్వాలలో గర్భిణీ మృతి చెందిన ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది.
హైదరాబాద్: ప్రతి ఆసుపత్రిలో డెలీవరీతో పాటు ఇతర ఎమర్జెన్సీ కేసులకు వైద్యం చేయాలని తెలంగాణ హైకోర్టుప్రభుత్వాన్ని ఆదేశించింది. గద్వాలలో గర్భిణీ మృతి చెందిన ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది.
న్యాయవాది కిషోర్ కుమార్ రాసిన లేఖను తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రసవం కోసం 200 కి.మీ దూరం ఆ మహిళ తిరిగింది. చివరకు పేట్లబురుజు ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె మరణించింది. ఈ ఘటన గత నెల 24 వ తేదీన చోటు చేసుకొంది.
undefined
గద్వాల జిల్లా అయిజ మండలానికి చెందిన న్యాయవాది కిషోర్ కుమార్ ఈ విషయమై హైకోర్టుకు లేఖ రాశారు. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకొని సోమవారం నాడు విచారణ చేసింది.డెలీవరి కోసం 200 కి.మీ దూరం మహిళ ప్రయాణించిన విషయం తెలుసుకొన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి ఆసుపత్రిలో ప్రసవంతో పాటు ఇతర అత్యవసర సేవలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
లాక్ డౌన్ నిబంధనలను తప్పుగా అర్ధం చేసుకోవడంతో తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోయారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కరోనాకు సంబంధం లేని ఇతర అత్యవసర రోగుల కోసం కూడ అంబులెన్స్ లను ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది.
also read:కరోనా, రైతుల సమస్యలపై రేపు కాంగ్రెస్ దీక్ష
గద్వాల జిల్లా రెడ్ జోన్ లో ఉన్నందున డెలీవరీ చేసేందుకు మహబూబ్ నగర్ తో పాటు హైద్రాబాద్ లోని కోఠి ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. కరోనా లేదని సర్టిఫికెట్ ఇస్తేనే డెలీవరీ చేస్తామని చెప్పడంతో ఈ సర్టిఫికెట్ తీసుకొచ్చిన తర్వాత ఆమెకు పేట్లబురుజు ఆసుపత్రిలో డెలీవరీ నిర్వహించారు. డెలీవరి అయిన తర్వాత తల్లీబిడ్డలు మరణించారు.
ఇదే ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలను మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకొంది. ఈ ఏడాది జూన్ 16 తేదీ లోపుగా నివేదిక ఇవ్వాలని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, మహబూబ్ నగర్ జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి, మహబూబ్ నగర్ ఆసుపత్రి సూపరింటెండ్, కోఠి ఆసుపత్రి సూపరింటెండ్లను ఆదేశించింది.