ఈ నెల 31 వరకు గ్రూప్-1 పరీక్ష ఫలితాలు ప్రకటించొద్దు: తెలంగాణ హైకోర్టు

Published : Jul 25, 2023, 02:13 PM ISTUpdated : Jul 25, 2023, 02:23 PM IST
ఈ నెల 31 వరకు గ్రూప్-1 పరీక్ష ఫలితాలు ప్రకటించొద్దు: తెలంగాణ హైకోర్టు

సారాంశం

తెలంగాణ గ్రూప్-1  ఫలితాలను సోమవారం వరకు  ప్రకటించవద్దని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

హైదరాబాద్:  తెలంగాణ గ్రూప్-1 ఫలితాలను సోమవారం వరకు  ప్రకటించవద్దని  హైకోర్టు ఆదేశించింది.  గ్రూప్-1  ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు  మంగళవారంనాడు విచారణ  నిర్వహించింది. ఈ పిటిషన్ పై టీఎస్‌పీఎస్‌సీ ఇవాళ  తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు  చేసింది. మరోవైపు ఈ విషయమై వాదనలు విన్పించేందుకు  సోమవారం వరకు  సమయం కావాలని  టీఎస్‌పీఎస్ సీ  హైకోర్టును అభ్యర్థించింది. సోమవారంనాడు  అడ్వకేట్ జనరల్ వాదనలు విన్పిస్తారని  టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. అయితే  అప్పటివరకు   గ్రూప్-1 పరీక్ష ఫలితాలను విడుదల చేయవద్దని  హైకోర్టు ఆదేశించింది.  సోమవారం వరకు ఫలితాలను వెల్లడించబోమని  టీఎస్‌పీఎస్‌సీ కూడ హైకోర్టుకు తెలిపింది.

ఈ ఏడాది జూన్  11న నిర్వహించిన గ్రూప్  1  ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని  కొందరు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షలో చోటు చేసుకున్న ఇబ్బందులను పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.  ప్రిలిమ్స్ పరీక్షను తిరిగి  నిర్వహించాలని  కోరారు.2022 అక్టోబర్ మాసంలో  గ్రూప్-1 ప్రిలిమ్స్  పరీక్షను  నిర్వహించారు. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఈ పరీక్షను రద్దు చేసింది టీఎస్‌పీఎస్‌సీ. అయితే  2022 అక్టోబర్ మాసంలో పాటించిన నిబంధనలను 2023 జూన్  11న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో ఎందుకు పాటించలేదని పిటిషనర్లు ప్రశ్నించారు.


ఈ విషయమై ఈ ఏడాది జూన్  22న  హైకోర్టులో విచారణ జరిగింది.  గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో కీలక అంశాలను ఎందుకు  విస్మరించారని  హైకోర్టు టీఎస్‌పీఎస్‌సీని ప్రశ్నించింది. ఈ పరీక్షకు  3.80 లక్షల మంది పరీక్షలు రాశారు. అయితే  టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో బయో మెట్రిక్ వంటి అంశాలను  టీఎస్‌పీఎస్‌సీ విస్మరించిందని పిటిషనర్లు  హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్