మంత్రికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు: శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత

By narsimha lode  |  First Published Jul 25, 2023, 1:18 PM IST

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు  హైకోర్టులో చుక్కెదురైంది.  మంత్రి  దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.


హైదరాబాద్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు  హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్ ను కొట్టివేయాలని  వేసిన  పిటిషన్ ను  హైకోర్టు మంగళవారంనాడు కొట్టి వేసింది.

ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు  వివరాలు ఇచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు  అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ కు  కొనసాగే అర్హత లేదని ఆ పిటిషన్ లో  రాఘవేంద్ర రాజు  పేర్కొన్నారు. రాఘవేంద్రరాజు పిటిషన్ కు  తెలంగాణ హైకోర్టు అనుమతిని ఇచ్చింది. తనపై దాఖలైన పిటిషన్ ను  కొట్టివేయాలని కోరుతూ  మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది.  

Latest Videos

undefined

2018  ఎన్నికల సమయంలో నామినేషన్ తో పాటు అఫిడవిట్ ను  మంత్రి శ్రీనివాస్ గౌడ్ దాఖలు  చేశారు.  అయితే  ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన  అఫిడవిట్ స్థానంలో కొత్త అఫిడవిట్ అప్ లోడ్  చేశారనే ఆయన ప్రత్యర్థులు ఆరోపణలు  చేశారు. ఈ విషయమై  రాఘవేందర్ రాజు  కేంద్ర ఎన్నికల సంఘానికి కూడ ఫిర్యాదు  చేశారు.  ఈ విషయమై విచారణ జరుగుతుంది. ఇదిలా ఉంటే  ఇదే విషయమై హైకోర్టులో  రాఘవేందర్ రాజు  దాఖలు చేసిన పిటిషన్ పై  మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్ చేశారు. మంత్రి పిటిషన్ ను  హైకోర్టు కొట్టివేసింది.


 

click me!