మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ఎన్ కౌంటర్: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Published : Jul 06, 2022, 01:11 PM ISTUpdated : Jul 06, 2022, 01:13 PM IST
మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ఎన్ కౌంటర్: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

సారాంశం

మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ఎన్ కౌంటర్ పై తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ ఎన్ కౌంటర్ పై పోలీసుల వాదనలు వినాలని సూచించింది. మరో వైపు మూడు మాసాల్లోపుగా విచారణను పూర్తి చేయాలని కూడా కోరింది.

హైదరాబాద్: Maoist అగ్రనేత Azad  ఎన్ కౌంటర్ పై Telangana High Court బుధవారం నాడు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పోలీసుల వాదనలు విని మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదిలాబాద్ జిల్లా కోర్టును ఆదేశించింది. 

2010 జూలై  1న ఉమ్మడి Adilabad  జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ కు సమీంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు  మధ్య జరిగిన Enounter లో మావోయిస్టు అగ్రనేత ఆజాద్ మరణించాడు. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత ఆజాద్ సహా జర్నలిస్ట్ హేమచంద్రపాండే మరణించారు. వీరిద్దరిని పోలీసులు సజీవంగా పట్టుకొని హత్య చేశారని ఆజాద్ భార్య ఆరోపించారు. ఆజద్ ఎన్ కౌంటర్ తో సంబంధం ఉన్న పోలీసులను విచారించాలని కూడా ఆజాద్ భార్య Padma  కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  అయితే ఈ పిటిషన్ ఆదిలాబాద్ జిల్లా కోర్టు 2015 మార్చి 24న కొట్టివేసిన విషయం తెలిసిందే. 

అయితే మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ఎన్ కౌంటర్ పై  Adilabad Court  2016 ఫిబ్రవరి 15న కీలక తీర్పును ఇచ్చింది. ఈ ఎన్ కౌంటర్  కేసును పునర్విచారణ చేయాలని ఆదిలాబాద్ కోర్టు నిర్ణయం తీసుకొంది.  ఈ కేసులో సంబంధం ఉన్న 26 మంది పోలీసులకు కోర్టు నోటీసులు కూడా పంపింది.ఈ విషయమై  ఆదిలాబాద్ కోర్టు తీర్పును పోలీసులు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ విషయమై విచారణ నిర్వహించిన హైకోర్టు ఆదిలాబాద్ పోలీసుల వాదనలను కూడా వినాలని ఆదిలాబాద్ కోర్టుకు సూచించింది. అంతేకాదు అదే సమయంలో మూడు మాసాల్లో విచారణను పూర్తి చేయాలని కూడా కోరింది. 

PREV
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu