ఉదయ్‌పూర్ టైలర్ హంతకులకు హైద్రాబాద్‌తో లింకులు: పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు, నోటీసులు

By narsimha lode  |  First Published Jul 6, 2022, 12:35 PM IST

ఉదయ్ పూర్ టైలర్  కన్హయలాల్ హత్య కేసులో నిందితులు గతంలో హైద్రాబాద్ లో ఆశ్రయం పొందారని ఎన్ఐఏ గుర్తించింది.ఈ విషయమై ఎన్ఐఏ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ విషయమై హైద్రాబాద్ కు చెందిన మున్వర్, ఆశ్రఫ్ లకు ఎన్ఐఏ నోటీసులు ఇచ్చిందని సమాచారం


హైదరాబాద్: Rajasthan  రాష్ట్రంలోని Udaipur లో టైలర్ Kanhaiya Lal హత్య కేసు నిందితులకు Hyderabad తో లింకులున్నాయా అనే కోణంలో NIA  అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  ఉదయ్ పూర్ లో టైలర్ ను హత్య చేసిన నిందితులు గతంలో హైద్రాబాద్ లో కూడా  ఉన్నారని ఎన్ఐఏ అధికారులు  తమ దర్యాప్తులో గుర్తించారు. ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్యలాల్ హత్య కేసులో ఇద్దరు నిందితులు  Ghous Mohammed, Mohammed Riyaz Attari లను ఎన్ఐఏ ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితులు హైద్రాబాద్ లోని సంతోష్ నగర్ ప్రాంతంలో షెల్టర్ తీసుకున్నారని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.  గతంలో అట్టారి, మహమ్మద్ గౌస్ లు  హైద్రాబాద్ వచ్చినట్టుగా పోలీసులు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. 

Karachi నుండి నేరుగా హైద్రాబాద్ వచ్చారని ఎన్ఐఏ తమ దర్యాప్తులో గుర్తించారు.  ఈ ఇద్దరు నిందితులకు హైద్రాబాద్ లోని ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు మంగళవారం నాడు విచారించారు.  మున్వర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధిారులు విచారించి వదిలేశారు.ఈ నెల 14న జైపూర్ లో నిర్వహించే విచారణకు హాజరు కావాలని కూడా ఎన్ఐఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. మున్వర్, హుస్సేన్ ఆశ్రఫ్  లను ఎన్ఐఏ అధికారులు  విచారించారని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. వీరిని ఈ నెల 14న రాజస్థాన్ లో నిర్వహించే విచారణకు రావాలని ఎన్టీవీ తన కథనంలో తెలిపింది.

Latest Videos

undefined

రాజస్థాన్ టైలర్ కన్హయలాల్ బీజేపీ నుండి సస్పెన్షన్ కు గురైన నుపుర్ శర్మ కు మద్దతుగా పోస్టును సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ పోస్టు షేర్ చేసిన కన్హయ్యలాల్ ను ఈ ఏడాది జూన్ 28న  నిందితులు హత్య చేశారు.  ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైంది.  ఈ కేసును ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. ఈ హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసి విచారణ నిర్వహిస్తుంది.ఈ విచారణలో  పోలీసులు కీలక  సమాచారాన్ని సేకరించారు. అట్టర్ ఫోన్ లో ఉన్న సమాచారం ఆధారంగా నిందితులు హైద్రాబాద్ లో ఆశ్రయం పొందారని గుర్తించారు. హైద్రాబాద్ లో వీరికి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి  ఇచ్చిన సలహాను కూడా నిందితులు పాటించారని కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారని ఎన్టీవీ తన కథనంలో తెలిపింది. 

హత్యకు సంబంధించి దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయాలని నిందితులకు ఎవరు సలహా ఇచ్చారనే విషయమై కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది.ఇదే సమయంలో నిందితులు గతంలో ఎక్కడెక్కడ తిరిగారు. వారికి వెవరెవరితో సంబంధాలున్నాయనే విషయమై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఉదయ్ పూర్ టైలర్ హత్య కేసులో జూన్ 29న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఉగ్రవాద నిరోధక చట్ట విరుద్ద కార్యకలాపాల కింద  కేసు నమోదైంది. ఐపీసీ 452, 302, 153ఏ, 153 బీ, 295 ఏ, 34 సెక్షన్లతో పాటు ఉపా చట్టం  1967 సెక్షన్లు 16,18, 20 కింద ఎన్ఐఏ అధికారులు కేసు నమోదు చేశారు.

click me!