ఈ నెల 1, 2 తేదీల్లో జరిగిన విచారణను పరిగణనలోకి తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైదరాబాద్: ఈ నెల 1, 2 తేదీల్లో జరిగిన విచారణను పరిగణనలోకి తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయమై ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. వెనుక గేటు కాదు.. రాచమార్గంలో వెళ్లి విచారణ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
also read:సీఎం కావాలని అనుకోలేదు, ఇంత కుట్రను చూడలేదు: ఈటల
undefined
జమున హేచరీస్ సంస్థ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేసింది. ఈ సందర్భంగా కీకల వ్యాఖ్యలు చేసింది. నోటీసులు ఇచ్చి విచారణ నిర్వహించాలని సూచించింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని హైకోర్టు కోరింది. శుక్రవారం నాడు నోటీసులు ఇచ్చి సోమవారం రిప్లై ఇవ్వమనేలా ఉండకూడదని తెలిపింది.
ఈ విషయమై ప్రతివాదులందరికీ కూడ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడ హైకోర్టు ఆదేశించింది.