నిబంధనలు పాటించకపోతే కేసులు : పబ్‌లపై పోలీసులకు హైకోర్టు ఆదేశం

By narsimha lode  |  First Published Sep 26, 2022, 6:35 PM IST


నిబంధనలు ఉల్లంఘించిన పబ్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ విషయమై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. 


హైదరాబాద్: నిబంధనలు పాటించని పబ్ లపై కేసులు నమోదు చేయాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.  పబ్ లపై దాఖలైన పిటిషన్లపై సోమవారం నాడు విచారించింది.  ఈ నెల 21వ తేదీన ఇచ్చిన ఆదేశాల విషయమై  ముగ్గురు పోలీసు్ కమిషనర్లు,  ఎక్సైజ్ శాఖ, జీహెచ్ఎంసీ శాఖ అధికారులు తమ నివేదికలను కోర్టు ముందుంచారు.

రాత్రి 10 గంటల తర్వాత పబ్ లలో మ్యూజిక్ సిస్టం ఉపయోగించవద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించిన పబ్ లపై కేసులు నమోదు చేయాలని నగరంలోని ముగ్గురు పోలీస్ కమిషనర్లను  ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్ పై విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు తెలిపింది. 

Latest Videos

జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ గ్రీన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరమణ సూర్యదేవర దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు చేపట్టిన విషయం తెలిసిందే.  నివాస ప్రాంతాలు  విద్యాసంస్థలకు సమీపంలో పబ్ లను అనుమతించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 21న ఈ విషయమై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. పబ్ లఅనుమతి సమయంలో ఎలాంటి నిబంధనలు పాటిస్తారో చెప్పాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. దీంతో ఇవాళ ఎక్సైజ్ శాఖ కౌంటర్ ను దాఖలు చేసింది. నిబంధనలను పాటించని పబ్ లపై ఎన్ని కేసులు నమోదు చేశారో చెప్పాలని  రాచకొండ, సైబరాబాద్, హైద్రాబాద్ పోలీస్ కమిషనర్లను కూడా హైకోర్టు ఆదేశించింది.  ఈ విషయమై ముగ్గురు పోలీసు కమిషనర్లు ఇవాళ హైకోర్టు ముందు నివేదికను ఉంచారు.

also read:సౌండ్స్ వద్దు, మైనర్లను అనుమతించొద్దు.. పబ్ యాజమాన్యాలకు తేల్చిచెప్పిన సైబరాబాద్ సీపీ

పబ్ ల విషయంలో గతంలో కూడా హైకోర్టు  ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పబ్ ల యజమానులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలను పాటించాలని కోరారు. పబ్ లలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అయితే ఆ తర్వాత అమ్నేషియా పబ్  లో జరిగిన పార్టీకి హజరై ఇంటికి వెళ్లే సమయంలో మైనర్ బాలికను నమ్మించి  తీసుకెళ్లిన నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో మరోసారి పబ్ ల వ్యవహరంపై చర్చ తెరమీదికి వచ్చింది.

పబ్ లలోకి మైనర్లను కూడ అనుమతించడంపై  కూడా విమర్శలు వెల్లువెత్తాయి. మైనర్లను పబ్ లలోకి అనుమతిస్తే చర్యలు తీసుకొంటామని పోలీసు శాఖ అధికారులు ప్రకటించారు. అయితే కొన్ని పబ్ లలో మైనర్లను కూడ అనుమతిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయమై గతంలో మీడియాలో కథనాలు వచ్చాయి. 

click me!