దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు శనివారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు శనివారం నాడు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు.
శనివారం నాడు దిశ నిందితుల మృతదేహాల విషయమై హైకోర్టు విచారించింది.తెలంగాణకు సంబంధం లేని నిపుణులైన వైద్యులతో రీ పోస్టుమార్టం పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రీ పోస్టుమార్టం ప్రక్రియను మొత్తం వీడియో తీయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ మృతదేహాలకు నిపుణులైన వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారని అడ్వకేట్ జనరల్ శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.
రీ పోస్టుమార్టం పూర్తైన తర్వాత మృతుల బంధువులకు మృతదేహాలను అప్పగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయినట్టుగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శ్రవణ్ శనివారం నాడు తెలంగాణ హైకోర్టుకు నివేదించారు.
Also read:దిశ నిందితుల మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయి: హైకోర్టుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్
నిందితులపై పోలీసులు ఏ రకమైన పరిస్థితుల్లో కాల్పులు జరిపారనే విషయమై తేల్చేందుకు పోస్టుమార్టం నివేదిక కీలకమైందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు కు నివేదించారు.
Also read:దిశ నిందితులు: చెన్నకేశవులు భార్య కూడ మైనరే
మృతదేహాలు కుళ్లిపోతే ఆధారాలు లభ్యం కాకుండాపోయే అవకాశం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది అభిప్రాయపడ్డారు. దీంతో రీ పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపుగా పూర్తి చేసి మృతదేహాలను బంధువులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also read:‘టీ అమ్మనీకి పోయినా’’.. నేను ఉండుంటే దిశపై దారుణం జరిగేది కాదు
ఈ నాలుగు మృతదేహాలకు తెలంగాణకు సంబంధం లేని నిపుణులతో రీ పోస్టుమార్టం నిర్వహించి సాక్ష్యాలను భద్రపర్చాలని హైకోర్టు ఆదేశించింది.దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ చేసిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. అన్ని ఆధారాలను సేకరించినట్టుగా కూడ తెలంగాణ అడ్వకేట్ జనరల్ తేల్చి చెప్పారు.
తెలంగాణలో నిపుణులైన డాక్టర్లు కూడ ఉన్నారని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కానీ, హైకోర్టు మాత్రం తెలంగాణకు సంబంధం లేని నిపుణులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
Also Read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాల అప్పగింతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
శవ పంచనామా జరిపిన అధికారులు, పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కూడ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులుగా హైకోర్టు గుర్తు చేసింది. శవ పంచనామా చేసిన అధికారులు కూడ జ్యూడీషీయల్ మేజిస్ట్రేట్స్ కాదని కోర్టు అభిప్రాయపడింది. వీరిపై పోలీసుల ప్రభావం కూడ ఉండే అవకాశం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.
మృతదేహాల రంగులు మారుతున్న విషయాన్ని గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ కూడ గుర్తు చేశారు. మరో వారం రోజుల్లో మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయే అవకాశం ఉందని కూడ హైకోర్టుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శ్రవణ్ చెప్పారు. దీంతో హైకోర్టు ధర్మాసనం ఈ మృతదేహాలకు రీ పోస్టు మార్టం నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.