రాత్రి 10 తర్వాత సౌండ్ పెట్టొద్దు: హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని 10 పబ్ లకు హైకోర్టు షాక్

By narsimha lode  |  First Published Dec 30, 2022, 2:31 PM IST

గతంలో  పబ్ లపై  విధించిన ఆంక్షలను ఎత్తివేయాాలని   తెలంగాణ హైకోర్టులో  పబ్ ల యజమానులు  పిటిషన్ దాఖలు చేశారు. రాత్రి  10 తర్వాత  సౌండ్ పెట్టొద్దని  హైకోర్టు  ఆదేశించింది. న్యూఇయర్ సందర్భంగా  పబ్ ల యజమానులు  ఆంక్షలను  ఎత్తివేయాలని కోరారు. 


హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ లో  ఉన్న 10 పబ్ లకు  తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది.  రాత్రి 10 గంటల తర్వాత  ఎట్టి పరిస్థితుల్లో  సౌండ్  పెట్టొద్దని   తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.  పబ్ లపై గతంలో తెలంగాణ హైకోర్టుఇచ్చిన ఆదేశాలపై  వేకేషన్ పిటిషన్ ను  కొందరు పబ్ ల యజమానులు దాఖలు చేవారు.  ఈ పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు శుక్రవారంనాడు విచారణ జరిపింది. గతంలో  పబ్ ల విషయంలో  ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్ధించింది.  న్యూఇయర్ సందర్భంగా  నిబంధనలు పాటించాల్సిందేనని  హైకోర్టు ఆదేశించింది.  రాత్రి 10 గంటల తర్వాత   ఎట్టి పరిస్థితుల్లో సౌండ్   రాకుండా  చూసుకోవాలని  హైకోర్టు  ఆదేశించింది.

హైద్రాబాద్ నగరంలోని  జూబ్లీహిల్స్  పరిధిలోని  10 పబ్ లలోనే రాత్రి 10 తర్వాత మ్యూజిక్ (సౌండ్) పెట్టొద్దని  హైకోర్టు ఆదేశించింది.  నగరంలోని అన్ని పబ్ లలో  ఉన్న నిషేధాన్ని జూబ్లీహిల్స్ లోని  10 పబ్ లకు మాత్రమే పరిమితం చేస్తూ ఈ ఏడాది నవంబర్ మాసంలో  హైకోర్టు ఆదేశించింది. పబ్ లలో రాత్రి 10 గంటల తర్వాత  మ్యూజిక్ పెట్టడంపై  హైకోర్టు సింగిల్ జడ్జి  ఈ ఏడాది సెప్టెంబర్  12న ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ ఉత్తర్వులపై  పబ్ ల యజమానులు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు.  దీంతో  హైకోర్టు డివిజన్ బెంచ్  జూబ్లీహిల్స పరిధిలోని  పబ్ లకు మాత్రమే ఈ నిషేధాన్ని వర్తింపజేసింది. 

Latest Videos

పబ్ లలో  రాత్రి పూట  పెద్ద పెద్ద శబ్దాలతో  మ్యూజిక్ పెట్టడంపై  నగరానికి చెందిన కొందరు  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా  తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది.  పబ్ లలో  ఎన్ని కేసులు నమోదు చేశారనే విషయాన్ని  ప్రశ్నించింది  తెలంగాణ హైకోర్టు. పబ్ ల విషయమై  తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని పోలీస శాఖను, ఇతర శాఖలను కూడా  హైకోర్టు గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. 


 

click me!