శంషాబాద్ లో పూజిత మృతి కేసు: డాక్టర్ అలీ అరెస్ట్

By narsimha lodeFirst Published Dec 30, 2022, 12:35 PM IST
Highlights

శంషాబాద్ లోని అపార్ట్ మెంట్ లో  ఆత్మహత్య చేసుకున్న  పూజిత అనే  సివిల్స్ కు ప్రిపేరౌతున్న విద్యార్ధిని మృతి కేసులో డాక్టర్ అలీని పోలీసులు అరెస్ట్  చేశారు. 

హైదరాబాద్: సివిల్స్ ప్రిపేర్ అవుతున్న పూజిత ఆత్మహత్య కేసులో   నిమ్స్ లో  పనిచేస్తున్న డాక్టర్ మహమూద్ అలీని  హైద్రాబాద్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్  చేశారు.ఉమ్మడి రంగారెడ్డి  జిల్లాలోని ఇబ్రహీంపట్నానికి చెందిన  పూజిత  సివిల్స్ కు ప్రిపేర్ అవుతుంది.  శంషాబాద్ లోని  ఓ అపార్ట్ మెంట్ లో  రూమ్ లో అద్దెకు ఉంటూ ఆమె సివిల్స్  కు ప్రిపేర్ అవుతుంది.   రెండు  రోజుల క్రితం  తాను  ఉంటున్న రూమ్ లోనే  పూజిత  అనుమానాస్పదస్థితిలో ఆమె ఉరేసుకొని మృతి చెందింది. ఈ ఘటనపై  పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.

ఈ దర్యాప్తులో  పోలీసులు కీలక విషయాలను గుర్తించారు.  గత నాలుగేళ్ల క్రితం  తన  తల్లికి  అనారోగ్య కారణాలతో  నిమ్స్ ఆసుపత్రికి ఆమె  వెళ్లిన సమయంలో   అక్కడ పనిచేసే డాక్టర్  మహమూద్ అలీతో పరిచయం ఏర్పడింది.  ఈ సమయంలో  అలీతో  ఏర్పడిన పరిచయం  ప్రేమకు దారితీసిందని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.  అప్పటికే  అలీకి పెళ్లైంది.  ఈ విషయాన్ని అలీ దాచి పెట్టాడని  ఆమె తర్వాత తెలుసుకుంది.  తనను పెళ్లి చేసుకోవాలని అలీని కోరితే  అతను ముఖం దాచేసినట్టుగా  పోలీసులు  గుర్తించారు. దీంతో ఆమె తాను నివాసం ఉంటున్న  గదిలో  కిటీికీ  ఉరేసుకొని మృతి చెందింది. ఈ కేసుకు సంబంధించి అలీని ఇవాళ పోలీసులు అరెస్ట్  చేశారు.

పూజిత నివాసం ఉంటున్న  విల్లా నుండి దుర్వాసన రావడంతో  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా  పోలీసులు ఈ విల్లా తలుపులు బద్దలు కొట్టి చూస్తే  పూజిత  మృతదేహం గుర్తించారు. పూజిత  ఉరేసుకొన్నట్టుగా  కన్పించింది.  పూజిత డెడ్ బాడీకి  కుటుంబ సభ్యులు  అంత్యక్రియలు పూర్తి చేశారు. పూజిత మృతిపై కుటుంబసభ్యులు  ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు. 


 

click me!