వక్ప్ ఆస్తుల కబ్జా: సీఈఓపై చర్యలకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

Published : Nov 16, 2020, 07:12 PM IST
వక్ప్ ఆస్తుల కబ్జా: సీఈఓపై చర్యలకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

సారాంశం

 ఆస్తులను పరిరక్షించలేని వక్ప్ బోర్డు సీఈఓపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.  

హైదరాబాద్:  ఆస్తులను పరిరక్షించలేని వక్ప్ బోర్డు సీఈఓపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

ముస్లిం స్మశాన వాటికలు, వక్స్ ఆక్రమణలపై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు విచారణ చేపట్టింది.

ఈ కేసు విచారణకు వక్ప్ బోర్డు  వక్స్ బోర్డు సీఈఓ మహ్మద్ ఖాసీం హాజరయ్యాడు.

వక్ఫ్ ఆస్తుల కబ్జాలపై పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని సీఈఓ వివరణ ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు చేసిన సీఈఓపై హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. 

వక్ప్‌బోర్డుకు చెందిన 85 కేసులు కబ్జా అయితే కేవలం 8 కేసులు ఎందుకు పెట్టారని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులు కేసులు పెట్టకపోతే కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది.

చట్టాలపై అవగాహన లేని అసమర్ధ అధికారులను సాగనంపాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. వక్ప్ ఆస్తుల పరిరక్షణ విషయమై  నివేదిక ఇవ్వాలని మైనార్టీ శాఖను హైకోర్టు  ఆదేశించింది. ఒకవేళ నివేదిక ఇవ్వకపోతే మైనార్టీ శాఖ, సీఎస్ కోర్టుకు హాజరు కావాలని  ఆదేశించింది.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?