సంగారెడ్డి జిల్లాలో కాల్పుల కలకలం: పరుగులు తీసిన ప్రజలు

By narsimha lodeFirst Published Nov 16, 2020, 4:41 PM IST
Highlights

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం గోవిందాపురంలో భూ వివాదం కాల్పులకు దారి తీసింది. ఇరు వర్గాల ఘర్షణలో ఓ వర్గం గాల్లోకి తుపాకీతో కాల్పులకు దిగింది.దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.


సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం గోవిందాపురంలో భూ వివాదం కాల్పులకు దారి తీసింది. ఇరు వర్గాల ఘర్షణలో ఓ వర్గం గాల్లోకి తుపాకీతో కాల్పులకు దిగింది.దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవిందాపురంలో కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. భూ వివాదంలో ఒక వర్గంపై మరో వర్గం బెదిరించేందుకు గాను గాల్లోకి కాల్పులు జరిపింది.ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

— Asianetnews Telugu (@AsianetNewsTL)

గోవిందాపూర్ కు చెందిన నందకిషోర్ తో పాటు మరో వ్యక్తికి ఈ గ్రామంలో ఉన్న 30 ఎకరాల భూమి విషయమై గొడవలు జరుగుతున్నాయి.ఈ భూమి వద్ద నందకిషోర్ తరపున  ఇద్దరు ఇక్కడ పనులు చేస్తున్నారు.

అయితే ఈ భూ వివాదం విషయమై  నందకిషోర్ తో మరో వ్యక్తి కొంతకాలంగా గొడవకు దిగాడు.ఇదే విషయమై ఇవాళ కూడ ఈ భూమి వద్ద ఉన్న నందకిషోర్  నియమించుకొన్న ఇద్దరు పని మనుషులను ప్రత్యర్ధి వ్యక్తి బెదిరించినట్టుగా స్థానికులు చెప్పారు.
ఈ క్రమంలోనే తుపాకీతో నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడని స్థానికులు చెబుతున్నారు. 

కాల్పుల శబ్దం విని స్థానికులు పరుగులు తీశారు.ఈ సమయంలో నందకిషోర్ అక్కడ లేడు.  ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.

కాల్పులు జరిపిన వ్యక్తి పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.కాల్పులు జరిపిన వ్యక్తికి తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేయనున్నారు.

click me!