గర్భిణీలను తరలించే ప్రైవేట్ వాహనాలకు పాస్‌లు అడగొద్దు: తెలంగాణ హైకోర్టు

By narsimha lode  |  First Published May 15, 2020, 3:33 PM IST

మృతి చెందిన గద్వాలకు చెందిన గర్భిణీ కుటుంబానికి ఆర్ధిక సహాయం చెల్లింపుపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.


హైదరాబాద్: మృతి చెందిన గద్వాలకు చెందిన గర్భిణీ కుటుంబానికి ఆర్ధిక సహాయం చెల్లింపుపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.

గద్వాలకు చెందిన గర్భిణికి సకాలంలో వైద్య సహాయం అందకపోవడంతో తల్లీబిడ్డలు మృతి చెందిన ఘటనపై అయిజకు చెందిన న్యాయవాది కిషోర్ కుమార్ రాసిన లేఖను తెలంగాణ హైకోర్టు విచారణకు చేపట్టిన విషయం తెలిసిందే. 

Latest Videos

undefined

also read:డెలీవరి కోసం 200 కి.మీ: తల్లీ బిడ్డల మృతిపై సీరియస్, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

డెలీవరీ కోసం గర్భిణీ 200 కి.మీ దూరం ప్రయాణించింది. చివరికి కరోనా లేదని సర్టిఫికెట్ తీసుకొస్తేనే డెలీవరీ చేస్తామని వైద్యులు చెప్పారు. చివరకు పేట్లబురుజు ఆసుపత్రిలో డెలీవరి చేశారు వైద్యులు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో తల్లీ బిడ్డలు గత నెల 24వ తేదీన మరణించారు.

ఈ ఘటనపై ఇవాళ హైకోర్టు విచారణను కొనసాగించింది. గర్భిణీలను తరలించే ప్రైవేట్ వాహనాలను పాస్ లు అడగకూడదని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెడ్ జోన్లలో కూడ కరోనాయేతర వైద్య అవసరాల కోసం అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలని కోర్టు కోరింది. రెడ్ జోన్లలో నోడల్ అధికారులను నియమించి విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

ఆసుపత్రుల్లో గర్భిణీలకు వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోర్టు కోరింది. గద్వాలకు చెందిన గర్భిణి మృతి చెందిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకొంటామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.ఈ కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు
 

click me!