గ్రాడ్యుయేట్స్ ఓట్ల నమోదుకు మరో అవకాశం: ఈసీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం

By narsimha lodeFirst Published Nov 6, 2020, 6:24 PM IST
Highlights

గ్రాడ్యుయేట్స్ ఓట్ల నమోదు గడువును పెంచాలని ఈసీకి రాష్ట్ర హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది.ఈ విషయమై కొత్త నోటిపికేషన్ ఇస్తామని ఈసీ హైకోర్టుకు తెలిపింది. డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తామన్న ఈసీ ప్రకటించింది.


అమరావతి: గ్రాడ్యుయేట్స్ ఓట్ల నమోదు గడువును పెంచాలని ఈసీకి తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది.ఈ విషయమై కొత్త నోటిపికేషన్ ఇస్తామని ఈసీ హైకోర్టుకు తెలిపింది. డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తామని ఈసీ ప్రకటించింది.

also read:ప్రాణాలు పోతున్నా తేదీలు మార్చొద్దా: ఈసీని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు

గతంలో ఫారమ్ 18 అప్లికేషన్ ద్వారా చేసుకున్న వారు ఇప్పుడు ఫామ్ 6, 7 ద్వారా అప్లికేషన్ చేసుకొనేలా చేస్తామని ఈసీ హైకోర్టుకు తెలిపింది.
గతంలో జారీ చేసిన ఓటు నమోదు నేటితోనే ముగుస్తుందని హైకోర్టుకు తెలిపింది ఈసీ.

అవసరమైతే డిసెంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు దరఖాస్తు చేసుకొనె వెసులుబాటును కల్పించింది. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది.

ఈసీ వివరణ నమోదు చేసి పిటిషన్ పై విచారణ ముగించింది.హైకోర్టు. పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలన్న హైకోర్టు ఆదేశాల ను అమలు చేస్తామని ఈసీ తెలిపింది.ఓటర్ల నమోదు గడువును పెంచాలని దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు గురువారం నాడు విచారించింది.ఈ విషయమై ఇవాళ కూడ విచారించింది. గడువును పెంచాలని గురువారం నాడే హైకోర్టు ఈసీని కోరింది.గడువును పొడిగిస్తామని ఈసీ ఇవాళ హైకోర్టుకు తెలిపింది. 
 

click me!