పెన్షన్ల కోతపై ఆర్డినెన్స్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

By narsimha lodeFirst Published Jun 19, 2020, 3:48 PM IST
Highlights

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లలో కోత విధిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు చేసింది.

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లలో కోత విధిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు చేసింది.

పెన్షన్లలో కోత విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సవాల్ చేస్తూ విశ్రాంత డిఎఫ్ఓ రామన్ గౌడ్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పెన్షనర్లకు పూర్తి ఫించన్ చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ సమయంలో ఫించన్లలో కోత ఏ చట్ట ప్రకారం విధిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దమని ప్రభుత్వం పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

ఈ నేపథ్యంలో విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల ఫించన్లలో కోత విధించేలా ఆర్డినెన్స్ జారీ చేసింది.
ఆర్డినెన్స్ పై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందనే నెపంతో రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు కూడ కోత విధించింది. దీనిపై ఈ నెల 15వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

అయితే మరునాడే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పెన్షనర్లకు కోత విధించడంలో సమాధానం చెప్పలేక ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని రిటైర్డ్ ఉద్యోగులు ఆరోపించారు.తాజాగా ఆర్డినెన్స్ పై రామన్ గౌడ్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.


 

click me!