కోర్టు ధిక్కరణ కేసులకు రూ. 58 కోట్లా?: సీఎస్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

By narsimha lodeFirst Published Aug 4, 2021, 2:32 PM IST
Highlights

కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చుల కింద రూ. 58 లక్షలు ఖర్చు చేయడంపై  హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయని కోర్టు ప్రశ్నించింది.ఈ విషయమై వ్యక్తిగత హోదాలో సీఎస్ సోమేష్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్ కుమార్ కు తెలంగాణ హైకోర్టు బుధవారంనాడు నోటీసులు జారీ చేసింది.ఈ విషయమై దాఖలు చేసిన  పిల్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు  విచారణ నిర్వహించింది. కోర్టు ధిక్కరణ కేసులకు సంబంధించి రూ. 58 కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఈ విషయమై ట్రెజరీలు ఎలా అనుమతిచ్చాయని కూడ కోర్టు అడిగింది.

ప్రజాధనాన్నిఎలా ఖర్చు చేస్తారో వివరించాలని కోర్టు కోరింది. ఈ విషయమై రెవిన్యూ, ఆర్ధికశాఖ కార్యదర్శులతో పాటు సీసీఎల్ఏ , ట్రెజరీ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు వ్యక్తిగత హోదాలో కోర్టు నోటీసులు పంపింది.ఈ కేసు విచారణకు అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
 

click me!