వైఎస్ షర్మిల పాదయాత్రకు వైఎస్ షర్మిల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ పోలీసులు పాదయాత్రకు అనుమతిని ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్‌టీపీ నేతలు ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు మంగళవారంనాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్ఆర్ టీపీ నేతలు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత పాదయాత్రకు హైకోర్టు అనుమతినని ఇచ్చింది.తాము అనుమతిని ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు ఎలా షర్మిల పాదయాత్రను నిరాకరించారని హైకోర్టు ప్రశ్నించింది. రాజకీయ నేతలు పాదయాత్ర కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడ షర్మిల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
తెలంగాణను తాలిబన్ల రాష్ట్రంగా షర్మిల వ్యాఖ్యానించారని ప్రభుత్వ న్యాయవాది గుర్తు చేశారు.రాజ్ భవన్ నుండి బయటకు వచ్చిన తర్వాత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని హైకోర్టు దృష్టికి ప్రభుత్వ న్యాయవాది తీసుకు వచ్చారు. రాజ్ భవన్ వద్ద వ్యాఖ్యలు చేస్తే పాదయాత్రకు ఎందుకు అనుమతిని ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నించింది. బీఆర్ఎస్ నేతలపై కూడా షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. హైద్రాబాద్ లో ఉంటూ తెలంగాణ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సాధారణమని హైకోర్టు తెలిపింది.
ఈ ఏడాది నవంబర్ 28న నర్సంపేటలో బీఆర్ఎస్ శ్రేణులు వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల బస్సును దగ్ధం చేశారు. వైఎస్ఆర్‌టీపీ వాహనాలను ధ్వంసం చేశారు. నవంబర్ 27న నర్సంపేటలో నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై విమర్శలు చేశారు.ఈ విమర్శలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. కానీ షర్మిల క్షమాపణ చెప్పలేదు. దీంతో వైఎస్ఆర్‌టీపీ వాహానాలను ధ్వంసం చేశారు.
అంతేకాదు షర్మిలను పోలీసులను అదుపులోకి తీసుకొని హైద్రాబాద్ లోని లోటస్ పాండ్ లో అదే రోజున పోలీసులు వదిలివెళ్లారు. అయితే నవంబర్ 28న ప్రగతి భవన్ వద్ద దెబ్బతిన్న వాహనాలతో ప్రగతి భవన్ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న షర్మిలను పోలీసులు పంజాగుట్ట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదే రోజున పాదయాత్రకు అనుమతి కోరుతూ తెలంగాణ హైకోర్టులో వైఎస్ఆర్‌టీపీ నేతలు పిటిషన్ ను దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు పాదయాత్రకు అనుమతిని ఇచ్చింది.
ఈ నెల 4వ తేదీ నుండి పాదయాత్రను ప్రారంభించాలని షర్మిల భావించారు. కానీ ఈ పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతించలేదు. వైఎస్ఆర్‌టీపీ నేతలకు వరంగల్ పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు వైఎస్ఆర్‌టీపీ నేతలు సమాధానం ఇచ్చారు. కానీ వరంగల్ పోలీసుల నుండి అనుమతి రాలేదు.
also read:లోబీపీ, బలహీనతతో ఉన్నారు: వైఎస్ షర్మిల హెల్త్ బులెటిన్ విడుదల
దీంతో ఈ నెల 9వ తేదీన ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద షర్మిల ఆమరణ దీక్షకు దిగారు. ట్యాంక్ బండ్ నుండి అంబేద్కర్ విగ్రహం నుండి లోటస్ పాండ్ కు తీసుకెళ్లారు. లోటస్ పాండ్ వద్ద షర్మిల ఆమరణదీక్ష చేశారు.ఈ నెల 10వ తేదీన షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమెను ఆపోలో ఆసుపత్రికి తరలించారు. ఆపోలో ఆసుపత్రి నుండి ఆమెను నిన్న డిశ్చార్జ్ చేశారు. పాదయాత్రకు అనుమతిని కోరుతూ ఇవాళ వైఎస్ఆర్‌టీపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే గతంలో పాదయాత్రకు ఇచ్చిన షరతులు వర్తిస్తాయని హైకోర్టు తెలిపింది.