దేశ రాజధానిలో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ మంగళవారంనాడు పరిశీలించారు. రేపు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం విషయమై పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేశారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారంనాడు పరిశీలించారు. ఈ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ రేపు ప్రారంభించనున్నారు. ఇవాళ, రేపు ఈ కార్యాలయంలో రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు సాయంత్రమే హైద్రాబాద్ నుండి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం 12: 37 గంటల నుండి 12:47 మధ్య బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. పార్టీలో పనుల పురోగతిని తెలంగాణ సీఎం కేసీఆర్ పరిశీలించారు.
ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీన ఈ కార్యాలయాన్ని పరిశీలించిన కేసీఆర్ పలు సూచనలు చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. దీంతో న్యూఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించాలని కేసీఆర్ తలపెట్టారు. రేపు బీఆర్ఎస్ తాత్కాలిక భవన కార్యాలయానికి సంబంధించి సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. ఇవాళ ఉదయం న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో పార్టీ స్వంత భవన నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించారు. అక్కడి నుండి సర్ధార్ పటేల్ రోడ్డులో గల తాత్కాలిక భవనానికి కేసీఆర్ చేరుకున్నారు.
undefined
పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. త్వరలోనే దేశ వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఆయా రాష్ట్రాల్లోని ఇతర పార్టీలతో కలిసి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయనుంది.గతంలోనే కొన్ని రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించారు.కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నేతలు, సీఎంలతో కేసీఆర్ చర్చలు జరిపారు.
also read:కారణమిదీ: న్యూఢిల్లీలో బీఆర్ఎస్ ప్లెక్సీల తొలగింపు
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కేసీఆర్ రాష్ట్రాల పర్యటనను చేపట్టనున్నారు. మహారాష్ట్ర నుండి తన పర్యటనను ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. రేపు బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ కమిటీలను ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. పార్టీ విధానాలను ప్రకటించనున్నారు.
కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశం ఆర్ధికంగా వెనుకబడిందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణ తరహలో పనిచేస్తే దేశం కూడా అబివృద్దిలో ముందుకు వెళ్లేదని కేసీఆర్ చెబుతున్నారు. తమ పార్టీ విధానాలను కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.