హైదరాబాద్ స్కూల్లో క్షుద్రపూజలు.. వింత ఆకారాలు, ముగ్గులు... సీసీ ఫుటేజీలు మాయం..!!

By SumaBala Bukka  |  First Published Dec 13, 2022, 2:09 PM IST

రాజేంద్రనగర్ లోని ఓ ప్రభుత్వ పాఠశఆలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. దీంతోపాటు స్కూల్లో సీసీ టీవీ ఫుటేజీలు మాయం అవ్వడం భయాందోళనలు కలిగిస్తోంది. 


హైదరాబాద్ : సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా… టెక్నాలజీ మన జీవితాల్లోకి చొచ్చుకొని వచ్చినా.. మనిషి అంతరిక్షంలో విహరిస్తున్నా.. మూఢనమ్మకాలు మాత్రం వదలడం లేదు. డబ్బు కోసమో,  గుప్త నిధుల కోసమో, ముక్తి, మోక్షం…అంటూ అనేక కారణాలతో..  కొంతమంది క్షుద్ర పూజలు చేస్తున్నారు. మంత్రాలు, తంత్రాలు అంటూ మూఢనమ్మకాలకు పాల్పడుతున్నారు. దీంతో అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నారు. అలాంటి ఓ ఘటన తాజాగా రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ లోని ఓ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. 

రాజేంద్రనగర్ పరిధిలోని ఓ స్కూల్ లో.. క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు  విద్యార్థులను, టీచర్లను భయాందోళనలకు గురి చేసింది. స్కూల్లో ని సైన్స్ ల్యాబ్, స్టోర్ రూమ్ లలో క్షుద్రపూజలు జరిగినట్లు ముగ్గులు, బొమ్మలు, విచిత్ర ఆకారాలు ఉన్నాయి. ఏం జరిగిందో కనుక్కోవడానికి టీచర్లు సీసీటీవీ ఫుటేజ్ లు చెక్ చేయడానికి ప్రయత్నించగా.. అవి కూడా కనిపించలేదు. దీంతో ఈ ఘటన మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించారు.

Latest Videos

అచ్చు దృశ్యం సినిమానే: డాక్టర్ వైశాలి కిడ్నాప్‌నకు నవీన్ రెడ్డి పక్కా ప్లాన్

ఈజీ మనీ కోసం క్షుద్ర పూజల పేరుతో దేవాలయాలు, పురాతన భవనాల్లో తవ్వకాలు సాగిస్తూ కొంతమంది హడావుడి చేస్తున్నారు. ఈ కోవలోనే రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ స్కూల్లో ఈ క్షుద్రపూజలు జరిగి ఉండొచ్చి పోలీసులు అంటున్నారు. క్షుద్రపూజలు ఎవరు చేశారు? దీని వెనుక ఎవరు ఉన్నారు? అనేది దర్యాప్తులో తేలిందని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా హైదరాబాదులోనే కేపీహెచ్బీ పరిధిలో ఇలాంటి ఘటనే  అక్టోబర్ 24న వెలుగు చూసింది. అక్కడే స్మశాన వాటిక వద్ద కాలిపోయిన స్థితిలో మృతదేహం లభించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హైదర్నగర్ స్మశాన వాటిక  దగ్గర గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహం కాల్చేశారు. కాలిపోయిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే మృతదేహం దొరికిన ఈ ప్రాంతానికి సమీపంలో క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించడం ఇప్పుడు భయాందోళనలు రేపుతుంది. తెల్లవారి అమావాస్య కావడం, సూర్యగ్రహణం కూడా ఉండడంతో.. బలి ఇచ్చి ఉంటారనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు క్లూస్ టీమ్ సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహం ఎవరిదో తెలుసుకోవడానికి  దర్యాప్తు చేస్తున్నామని.. గత రాత్రి హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.

click me!