తెలంగాణ భవన్ కు రేవంత్ సర్కార్ నోటీసులు...

By Arun Kumar P  |  First Published Jan 4, 2024, 3:43 PM IST

భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమితో తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బిఆర్ఎస్ పార్టీకి సమస్యలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీస్ కేసులు నమోదవగా మరికొందరేమో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు వివిధ శాఖల నుండి నోటీసులు అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా బిఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ కే రెవెన్యూ అధికారులు నోటీసులు జారీచేయడం సంచలనంగా మారింది. 

రాజకీయ పార్టీ కార్యాలయంలో టీవి ఛానల్ కార్యకలాపాలు కొనసాగించడాన్ని రెవెన్యూ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించిన టీవి ఛానల్ యాజమాన్యం ఇప్పటికే ఆఫీస్ తరలింపు ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. తాజాగా రెవెన్యూ శాఖ నోటీసులతో తరలింపు ప్రక్రియ మరింత వేగవంతం చేసినట్లు తెలిపారు.  

Latest Videos

Also Read  బంజారాహిల్స్ లో వలసకూలీని కొట్టిచంపిన సెక్యురిటీ గార్డులు...

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న 2011 లో  బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఓ న్యూస్ ఛానల్ ను ప్రారంభించారు. ఈ ఛానల్ కార్యకలాపాలన్న బిఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ నుండే సాగాయి. ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్లపాటు బిఆర్ఎస్ అధికారంలో వుంది కాబట్టి రాజకీయ పార్టీ కార్యాలయంలో టీవి ఛానల్ కొనసాగినా అధికారులెవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇటీవలే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోడానికి సిద్దమయ్యారు.  

click me!