కరోనా హెల్త్ బులెటిన్‌: ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు

By narsimha lode  |  First Published Jul 20, 2020, 3:13 PM IST

ప్రజల ఆరోగ్యాలను  ప్రభుత్వం గాలికి వదిలేసిందని తెలంగాణ హైకోర్టు మండిపడింది. 



హైదరాబాద్: ప్రజల ఆరోగ్యాలను  ప్రభుత్వం గాలికి వదిలేసిందని తెలంగాణ హైకోర్టు మండిపడింది. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టులపై హైకోర్టు సోమవారం నాడు విచారించింది.కరోనా టెస్టులు, సమాచారం సరిగ్గా వెల్లడించడం లేదని హైకోర్టు మరోసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కూడ ఇదే తరహలో హైకోర్టు ప్రభుత్వ తీరుపై వ్యాఖ్యలు చేసింది.

Latest Videos

undefined

also read:కరోనా హెల్త్ బులిటెన్‌లో అరకొర సమాచారం: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

కరోనా టెస్టుల వివరాలు ఇచ్చే హెల్త్ బులెటిన్లలో ఇప్పటికే సమగ్ర వివరాలు ఇవ్వడం లేదని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆదేశాలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది.

తాము ఆదేశాలు ఇస్తున్నా ఒక్కటీ కూడ అమలు కావడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.ఆసుపత్రులవారీగా బెడ్లు, వెంటిలేటర్ల వివరాలు ఇవ్వడం లేదని హైకోర్టు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. 

గతంలో కూడ ఈ సమాచారాన్ని సమగ్రంగా ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.  కరోనా హెల్త్ బులెటిన్ ను తాము అభినందించినట్టుగా ఎందుకు ఇచ్చారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలా చేయడంపై  హైకోర్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సీరియస్ అయింది.


 

click me!