తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇంతకీ ఏ పిటిషన్ ? ఎందుకు కొట్టివేసిందనే వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. కేసీఆర్ పై 2019లో దాఖలైన ఎలక్షన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గజ్వేల్ నుంచి 2018లో కేసీఆర్ గెలువడాన్ని సవాల్ చేస్తూ దాఖలపై ఎన్నికల పిటిషన్ పై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. 2018లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్ లో పలు వాస్తవాలను వివరించకుండా గోప్యంగా ఉంచారంటూ,కేసీఆర్ పై 64 కేసులు నమోదు కాగా.. కేవలం 2 కేసుల గురించి మాత్రమే అఫిడవిట్‌లో పేర్కొన్నారన్నారు. ఈ మేరకు కేసీఆర్ ఎన్నికను రద్దు చేయాలని 2019లో సిద్ధిపేట జిల్లా మామిడ్యాలకు చెందిన టి. శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి 2018లో జరిగిన ఎన్నికల కాలపరిమితి గడువు ముగిసిన కారణంగా ఎన్నికల పిటిషన్ పై విచారణ కొనసాగింపు అవసరం లేదని వెలువరించిన తీర్పులో స్పష్టం చేశారు. 2018 ఎన్నికల కాలపరిమితి ముగిసిందని.. దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా ఫలితం ఉండదని పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
గతంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కీలక నిర్ణయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. పలువురి ఎన్నిక చెల్లదంటూ కూడా కీలక తీర్పునిచ్చింది ధర్మాసనం. కాగా.. ఇప్పుడు మాత్రం 2018 ఎన్నిక కాలపరిమితి ముగియగా.. కేసీఆర్ మీద దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.