కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు చుక్కెదురు: సీసీఎస్ నోటీసులపై స్టేకి హైకోర్టు నిరాకరణ


కాంగ్రెస్ వ్యూహకర్త  సునీల్ కనుగోలు  దాఖలు చేసిన పిటిషన్ పై  స్టేకి  తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. 


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త  సునీల్  కనుగోలు  దాఖలు చేసిన పిటిషన్ పై స్టే ఇచ్చేందుకు  హైకోర్టు నిరాకరించింది.  ఈ నెల  8వ తేదీన  సునీల్ కనుగోలు  పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.   పోలీసుల విచారణకు సహకరించాలని సునీల్ కనుగోలుకు  సూచించింది.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త  సునీల్  కనుగోలు  దాఖలు చేసిన పిటిషన్ పై స్టే ఇచ్చేందుకు తెలంగాణ  హైకోర్టు నిరాకరించింది.  ఈ నెల  8వ తేదీన  సునీల్ కనుగోలు  పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.   పోలీసుల విచారణకు సహకరించాలని సునీల్ కనుగోలుకు  సూచించింది.

Latest Videos

సీసీఎస్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ గత ఏడాది డిసెంబర్  29న సునీల్ కనుగోలు  తెలంగాణ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలను తెలగాణ హైకోర్టు విన్నది. ఈ పిటిషన్ పై  తీర్పును ఇవాళ వెల్లడించనున్నట్టుగా  ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్  30వ తేదీన ఈ పిటిషన్ పై తీర్పును తెలంగాణ హైకోర్టు  రిజర్వ్ చేసింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు  మహిళలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని  పోలీసులకు  ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా  ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ విషయమై ఐపీ అడ్రస్ ఆధారంగా  హైద్రాబాద్ మాదాపూర్ లోని సునీల్ కనుగోలు కార్యాలయంపై  సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు.గత ఏడాది డిసెంబర్  13వ తేదీన  మాదాపూర్ లోని  సునీల్ కార్యాలయంలో సోదాలు చేశారు.  ఈ సోదాల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సీసీఎస్ పోలీసులు వాగ్వాదానికి దిగారు. 

also read:సీసీఎస్ నోటీసులపై స్టే కోరుతూ సునీల్ కనుగోలు పిటిషన్: తీర్పును రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు

ఈ విషయమై విచారణకు రావాలని సీసీఎస్ పోలీసులు సునీల్ కనుగోలుకు  నోటీసులు జారీ చేశారు. అయితే  ఈ విషయమై  తనకు 10 రోజుల సమయం ఇవ్వాలని  సునీల్ కనుగోలు  సీసీఎస్ పోలీసులను కోరారు. గత ఏడాది డిసెంబర్  26న సునీల్ కనుగోలు   సీసీఎస్ పోలీసుల విచారణకు హాజరు కావాలి. కానీ ఆయన సీసీఎస్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. దీంతో  గత ఏడాది డిసెంబర్  27న మరోసారి సీసీఎస్ పోలీసులు సునీల్ కనుగోలుకు  నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసులను  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  మల్లు రవి తీసుకున్నారు.  ఈ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ   సునీల్ కనుగోలు  తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే  స్టే ఇచ్చేందుకు  తెలంగాణ హైకోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. సునీల్ కనుగోలును అరెస్ట్  చేయవద్దని తెలంగాణ హైకోర్టు  పోలీసులను ఆదేశించింది.
 

click me!