సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు : నేడు బాసర బంద్

By narsimha lode  |  First Published Jan 3, 2023, 9:59 AM IST

బాసర అమ్మవారిపై  ఆనుచిత వ్యాఖ్యలు చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని బాసర బంద్ నిర్వహిస్తున్నారు.  వ్యాపారులు స్వచ్చంధంగా  తమ దుకాణాలను మూసి వేశారు. 


హైదరాబాద్:  బాసర సరస్వతి అమ్మావారిపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ  మంగళవారం నాడు  బంద్ నిర్వహిస్తున్నారు. అమ్మవారిపై  అనుచిత వ్యాఖ్యలు చేసిన  వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు  కోరుతున్నారు. సరస్వతి అమ్మవారిపై వ్యాఖ్యలను నిరసిస్తూ  బాసరలో  వ్యాపారులు స్వచ్చంధంగా  బంద్ ను  పాటిస్తున్నారు. బంద్ తో  బాసర రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ  రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోతో  వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ వ్యాఖ్యలపై  బాసర ఆలయానికి చెందిన  అర్చకులు  కూడా  నిరసన తెలపనున్నారు.బాసర సరస్వతి అమ్బవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన  రాజేష్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

గత ఏడాది డిసెంబర్ లో   వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లిలో జరిగిన సభలో  బైరి నరేష్ అనే వ్యక్తి అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అయ్యప్ప భక్తులు  పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.  నరేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దీంతో నరేష్ ను పోలీసులు అరెస్ట్  చేశారు.   అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో  నరేష్ పై  పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు  కేసు నమోదు చేశారు. అయ్యప్పస్వామిపై ఉద్దేశ్యపూర్వకంగానే  వ్యాఖ్యలు చేసినట్టుగా  నరేష్ ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నరేష్ అయ్యప్పస్వామిపై  చేసిన వ్యాఖ్యల వీడియో  వైరల్ గా మారి  రాష్ట్ర వ్యాప్తంగా  నిరసనలు తీవ్రమయ్యాయి.  గత ఏడాది డిసెంబర్  31న నరేష్ ను  పోలీసులు  అరెస్ట్  చేశారు.

Latest Videos

click me!