municipal polls: న్యాయస్థానం తీర్పులో ట్విస్ట్, కేసీఆర్ కు వరం

Published : Oct 22, 2019, 12:38 PM ISTUpdated : Oct 22, 2019, 01:23 PM IST
municipal polls: న్యాయస్థానం తీర్పులో ట్విస్ట్, కేసీఆర్ కు వరం

సారాంశం

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ట్విస్టిచ్చింది. హైకోర్టు సింగిల్ జడ్జి 77 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది.ఈ మున్సిపాలిటీల్లో స్టే వేకేట్ చేయించుకోవాలని ప్రభుత్వానికి డివిజన్ బెంచ్ సూచించింది.


హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ప్రభుత్వానికి ట్విస్టిచ్చింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే విధించిన 75 మున్పిపాలిటీల్లో స్టేను వేకేట్ చేయించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

తెలంగాణ రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీలతో పాటు మరో 13 కార్పోరేషన్లు ఉన్నాయి.ఈ కార్పోరేషన్లలో ప్రస్తుతం పాలకవర్గాలు కొనసాగుతున్నాయి.

related article తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా తయారీని చేపట్టారు. అయితే రిజర్వేషన్ల ప్రక్రియలో  అవకతవకలు చోటు చేసుకొన్నాయని పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

మున్సిపాలిటీల్లోని ఓటర్ల జాబితాలో పొరపాట్లు జరిగాయని కూడ హైకోర్టును ఆశ్రయించిన వారు కూడ ఉన్నారు. దీంతో హైకోర్టు ప్రభుత్వంతో పాటు పిటిషనర్ల వాదనలను వింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిచేయాలని, రిజర్వేషన్ల ప్రక్రియలో అవకతవకలను సరిచేయాలని పిటిషనర్లు కోరారు.

అంతేకాదు రిజర్వేషన్లు, వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో చోటు చేసుకొన్న పరిణామాల్లో అవకతవకలను సరిచేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో పిటిషనర్లు గట్టిగా వాదించారు.

దీంతో రాష్ట్రంలోని 77 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణపై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. హైకోర్టు డివిజన్ బెంచ్  లో కూడ రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

ఈ వ్యాజ్యాల్లో కూడ వార్డుల రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాలో అవకతవకలు, రిజర్వేషన్ల ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకొన్నాయని పిటిషనర్లు మరోసారి హైకోర్టు డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు.

అయితే పిటిషనర్ల వాదనలను కొన్నింటిలో వాస్తవం ఉందని  తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వం అంగీకరించింది. అయితే వీటిని సరిచేస్తామని కూడ ప్రకటించింది. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టుగా ఈ నెల 1వ తేదీన ప్రకటించింది.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల  ప్రక్రియపై  హైకోర్టు డివిజన్ బెంచ్  మంగళవారం నాడు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే  మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి 75 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ లో ఉన్న స్టే ను వేకేట్ చేయించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు డివిజన్ బెంచ్ సూచించింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !