
కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) ఓయూ పర్యటనకు (osmania university) తెలంగాణ హైకోర్టు (telangana high court) అనుమతి మంజూరు చేసింది. రాహుల్ సభకు అనుమతించాలని ఓయూ వీసీని హైకోర్టు ఆదేశించింది. విద్యార్ధులతో రాహుల్ ముఖాముఖికి న్యాయస్థానం అనుమతించింది. 150 మందితో మాత్రమే అనుమతించాలని వీసీని ఆదేశించింది.
అంతకుముందు ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది న్యాయస్థానం. విద్యార్ధుల సమస్యలు తెలుసుకునేందుకే.. రాహుల్ వస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. గతంలో వివిధ పార్టీలు చాలా సమావేశాలు పెట్టాయని.. ఇప్పుడు ఎందుకు అనుమతివ్వడం లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సింగిల్ బెంచ్ ఆదేశాలతో మళ్లీ దరఖాస్తు చేసుకున్నామని.. అయినా అనుమతి నిరాకరించారని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
కాగా.. ఉస్మానియా యూనివర్శిటీలో కాంగ్రెస్ మాజీ చీఫ్ Rahul Gandhiకి అనుమతివ్వాలని కోరుతూ NSUI సహా పలు విద్యార్ధి సంఘాలు బుధవారం నాడు Maha Rallyకి ప్రయత్నించాయి. ఈ ర్యాలీ నిర్వహించిన విద్యార్ధి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నెల 7వ తేదీన రాహుల్ గాంధీ Hyderabad రానున్నారు. Osmania university లోని ఠాగూర్ ఆడిటోరియంలో రాహుల్ గాంధీ సమావేశానికి Congress పార్టీ ప్లాన్ చేసింది. అయితే ఈ సమావేశానికి ఉస్మానియా వీసీ అనుమతిని నిరాకరించారు. ఓయూలో రాజకీయ పార్టీల సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని గతంలో తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగా రాహుల్ మీటింగ్ కు అనుమతి ఇవ్వడం లేదని వీసీ Ravinder ప్రకటించారు.
అయితే రాహుల్ విద్యార్ధులతో సమావేశం కానున్నారని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఈ సమావేశానికి రాజకీయాలతో సంబంధం లేదని కూడా ఆ పార్టీ తేల్చి చెప్పింది. ఎన్ఎస్‌యూఐతో పాటు లెప్ట్ వింగ్ విద్యార్ధి సంఘాలు రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీలో పర్యటించేందుకు అనుమతివ్వాలని కోరుతూ ర్యాలీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. మహా ర్యాలీకి ప్రయత్నించిన విద్యార్ధి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓయూలో రాహుల్ గాంధీ పర్యటన విషయమై ఓయూ విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించాలని హైకోర్టు రెండు రోజుల క్రితం వీసీ రవీందర్ ను ఆదేశించింది. అయితే రెండు రోజులుగా వీసీ అందుబాటులో లేరని తెలుస్తుంది. దీంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.