పాదయాత్ర కోసం ఎన్నిసార్లు వస్తారు: షర్మిల న్యాయవాదికి హైకోర్టు ప్రశ్న

By narsimha lode  |  First Published Feb 28, 2023, 5:21 PM IST

పాదయాత్రకు అనుమతి కోసం  వైఎస్ఆర్‌టీపీ  చీఫ్  వైఎస్ షర్మిల  కోర్టును ఆశ్రయించారు. గతంలో  కోర్టు  ఇచ్చిన ఆదేశాలను  షర్మిల ఉల్లంఘించారని  ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. 


హైదరాబాద్: పాదయాత్రకు అనుమతిచ్చేలా  పోలీసులను ఆదేశించాలని కోరుతూ  తెలంగాణ హైకోర్టులో  వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  పిటిషన్ దాఖలు  చేశారు.ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది మార్చి 3వ తేదీకి  హైకోర్టు వాయిదా వేసింది. 

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు  చేసినందుకు షర్మిల పాదయాత్రకు  పోలీసులు  అనుమతిని రద్దు చేశారు. షర్మిలను  మహబూబాబాద్  జిల్లా నుండి  హైద్రాబాద్  కు తీసుకువచ్చారు.  పాదయాత్రకుపోలీసులు అనుమతిని రద్దు చేయడంతో  షర్మిల మరోసారి హైకోర్టును  ఆశ్రయించారు.

Latest Videos

undefined

వైఎస్ఆర్‌టీపీ  పిటిషన్ పై  హైకోర్టు మంగళవారంనాడు  విచారణ నిర్వహించింది.  పాదయాత్రకు  ఎన్నిసార్లు హైకోర్టుకు వస్తారని షర్మిల తరపు న్యాయవాదిని  హైకోర్టు ప్రశ్నించింది.  
వ్యక్తులను లక్ష్యంగా  చేసుకుని ఎందుకు మాట్లాడుతున్నారని  షర్మిల తరపు న్యాయవాదిని  హైకోర్టు  అడిగింది.పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు  చేయాలని  హైకోర్టు  షర్మిల తరపు న్యాయవాదిని ఆదేశించింది. 

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని  కోర్టు గతంలో ఇచ్చిన  ఆదేశాలను  షర్మిల  ఉల్లంఘించారని ప్రభుత్వ న్యాయవాది  కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.  మహబూబాబాద్  ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై  షర్మిల చేసిన వ్యాఖ్యలను  ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు . ఈ మేరకు  వీడియోను  హైకోర్టుకు  అందించారు ప్రభుత్వ న్యాయవాది. 

ఈ నెల  19వ తేదీన  వైఎస్ షర్మిల పాదయాత్రకు  అనుమతిని రద్దు  చేశారు పోలీసులు.  మహబూబాబాద్  ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై  అనుచిత వ్యాఖ్యలు  చేసినందున   బీఆర్ఎస్  శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో ఉద్రిక్తత నెలకొంది.  ఈ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల ను పోలీసులు అదుపులోకి తీసుకొని  హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు.

also read:తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని షర్మిల డిమాండ్.. ఆస్పత్రిలో యూత్ కాంగ్రెస్ నాయకుడికి పరామర్శ..

ఈ ఏడాది జనవరి  28వ తేదీన  ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి వైఎస్ షర్మిల పాదయాత్రను పున: ప్రారంభించారు.  ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో  గతంలో  షర్మిల పాదయాత్ర  నిలిచిపోయింది. పాదయాత్ర  నిలిచిపోయిన  చోటు  నుండే  పాదయాత్ర  తిరిగి ప్రారంభమైంది.  మహబూబాబాద్  ఎమ్మెల్యే శంకర్  నాయక్  పై వివాదాస్పద వ్యాఖ్యలతో  మరోసారి షర్మిల పాదయాత్ర నిలిచిపోయింది.

click me!