హైద్రాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో నవీన్ ను హత్య చేసిన తర్వాత రక్తంతో తడిచిన దుస్తులను హరిహరకృష్ణ నిర్మానుష్య ప్రాంతంలో వేశాడు.
హైదరాబాద్:నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద నవీన్ హత్య కేసులో మరిన్ని కీలక విషయాలను పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. నవీన్ ను హత్య చేసిన తర్వాత రక్తంతో తడిచిన దుస్తులను హరిహరకృష్ణ పారేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
ఈ నెల 17వ తేదీన పెద్ద అంబర్ పేట వద్ద ఉన్న మద్యం దుకాణంలో లిక్కర్ ను కొనుగోలు చేశాడు హరిహరకృష్ణ. ఈ మద్యం బాటిల్ తో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు నవీన్,. హరిహరకృష్ణ.
undefined
నవీన్ ను హత్య చేయాలని ప్లాన్ లో ఉన్న హరిహరకృష్ణ కొద్దిగానే మద్యం తాగాడు. నవీన్ కు మాత్రం అతిగా మద్యం తాగించాడు. మద్యం తాగిన సమయంలో లవర్ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నవీన్ గొంతు నులిమి హత్య చేశాడు హరిహరకృష్ణ . అనంతరం నవీన్ శరీరబాగాలను అత్యంత దారుణం కోసి బ్యాగులో వేసుకున్నాడు. రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజాము వరకు హరిహరకృష్ణ సంఘటన స్థలం వద్దే ఉన్నాడు.
బ్యాగులో శరీర బాగాలను తీసుకుని బ్రహ్మణపల్లి వద్ద నిర్మానుష్య ప్రాంతంలో వేశాడు. తన ఇంటర్ స్నేహితుడు హసన్ నివాసం ఉండే బ్రహ్మణపల్లికి చేరకున్నాడు. రక్తం మరకలున్న బట్టలతో వచ్చిన హరిహరకృష్ణను ఏం జరిగిందని హసన్ ప్రశ్నించాడు. నవీన్ ను హత్య చేసినట్టుగా హరిహరకృష్ణ హసన్ కు చెప్పాడు. ఈ విషయమై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అనంతరం హరిహరకృష్ణ హసన్ ఇంట్లో స్నానం చేశాడు . తనకు ఓ జత బట్టలు కావాలని హసన్ ను కోరాడు. హసన్ తన దుస్తులను హరిహరకృష్ణకు ఇచ్చాడు. హసన్ దుస్తులను వేసుకున్న హరిహరకృష్ణ రక్తంతో తడిచిన దుస్తులను నిర్మానుష్య ప్రాంతంలో పారేశాడు.
నవీన్ గురించి పలువురు ఫోన్లు చేసినా కూడా హరిహరకృష్ణ ఏదో ఒక సమాధానం చెప్పాడు. ఈ నెల 18వ తేదీ నుండి ఖమ్మం, కోదాడ, వరంగల్, విశాఖపట్టణానికి హరిహరకృష్ణ వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు.
గతంలో హరిహరకృష్ణ పేరేంట్స్ అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో నివాసం ఉండేవారు. దీంతో ఈ ప్రాంతంపై హరిహరకృష్ణకు అవగాహన ఉంది. నవీన్ ను హత్య చేసేందుకు అబ్దుల్లాపూర్ మెట్ సరైన ప్రాంతంగా భావించాడని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన్ కథనం ప్రసారం చేసింది.
also read:బ్యాగులో శరీర బాగాలు, లవర్ కి సమాచారం: హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
నవీన్ ను హత్య చేసిన తర్వాత తమ ఇంటికి వచ్చిన హరిహరకృష్ణ స్నానం చేసి వెళ్లినట్టుగా అతని స్నేహితుడు హసన్ చెప్పారు. ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎబీఎన్ తో ఆయన మాట్లాడారు. హరిహరకృష్ణకు తాను సహకరించలేదని గుర్తించినందునే పోలీసులు తనను వదిలేశారని ఆయన చెప్పారు.