హోం ఐసోలేషన్ లో చనిపోయినవారికి కూడా .. జీహెచ్ఎంసీ అంత్యక్రియలు..

By AN TeluguFirst Published Apr 22, 2021, 1:31 PM IST
Highlights

ఇళ్లలో మరణించిన కోవిడ్ రోగుల అంత్యక్రియల నిర్వహణకు జిహెచ్ఎంసి ఏర్పాట్లు చేస్తోంది. పాజిటివ్‌గా నిర్ధారణ అయి, హోం ఐసోలేషన్ లో చనిపోయిన వారి దహన సంస్కారాలు జిహెచ్ఎంసి నిర్వహిస్తోందని ఓ అధికారి తెలిపారు.

అందుకు అయ్యే వ్యయాన్ని సంస్థే భరిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణించినవారి మృతదేహాలకు మాత్రమే జిహెచ్ఎంసి ఖర్చులతో అంత్యక్రియలు చేస్తున్నారు. బాధితులు 040-2111 1111, 91546 86549,  9154686558 నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదిలా ఉండగా కోవిడ్ మృతదేహాలకు ఎక్కడ దహనసంస్కారాలు జరుగుతాయి? అన్నదానిపై చాలామందికి స్పష్టత లేదు. ఇదే అదనుగా కొన్ని సంస్థలు చావునూ వ్యాపారం చేస్తున్నాయి.

అంత్యక్రియలకు 30 నుంచి 40 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. సాధారణ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం లేక బాధితులు అడిగినంత ఇవ్వాల్సి వస్తోంది. తాజాగా జిహెచ్ఎంసి నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాలకు కొంత ఉపశమనం గా మారనుంది.

click me!