రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలు: ఈటల సమీక్ష

By narsimha lodeFirst Published Sep 2, 2019, 8:14 PM IST
Highlights

రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్న విష జ్వరాలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు

రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్న విష జ్వరాలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్‌లోని ఆరోగ్య శ్రీ ట్రస్టు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో డెంగీ, ఇతర విష జ్వరాల ప్రభావం అందుబాటులో ఉన్న మందులు, తక్షణం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ... ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన రోగులు తప్పకుండా టెస్టులు చేయించుకోవాలని సూచించామని ఈటల తెలిపారు.

వ్యాధి నిర్థారణ తేలితే సరైన వైద్యం సకాలంలో అందించొచ్చని... పీహెచ్‌సీ నుంచి ఉన్నతస్థాయి ఆస్పత్రుల వరకు అన్నింటిలోనూ మందులు అందుబాటులో ఉండేలా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైన చోట ఎక్కువ మంది వైద్యులను అందుబాటులో ఉంచుతామన్నారు.

విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యులు సెలవులు తీసుకోకూడదని సూచించామని ఈటల వెల్లడించారు. కాగా.. రాష్ట్రంలో డెంగీ , ఇతర విషజ్వరాల కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆస్పత్రిపాలవుతుండటంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తాజా పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. 

click me!