కరోనా ఎఫెక్ట్: ఐదు రోజుల వ్యవధిలో జగిత్యాలలో దంపతులు మృతి

By narsimha lode  |  First Published Apr 27, 2021, 4:51 PM IST

జగిత్యాల జిల్లాలో కరోనాతో దంపతులు ఐదు రోజుల వ్యవధిలో మరణించారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. 
 


జగిత్యాల: జగిత్యాల జిల్లాలో కరోనాతో దంపతులు ఐదు రోజుల వ్యవధిలో మరణించారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. జగిత్యాల గ్రామీణ మండలంలోని తాటిపల్లిలో కరోనాతో ఐదు రోజుల క్రితం  మాజీ ఎంపీటీసీ సభ్యురాలు  నీలం లక్ష్మి మరణించారు. అయితే కరోనాతో ఆమె భర్త మంగళవారం నాడు మరణించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇదే రకంగా ఒకే కుటుంబంలో  కరోనాతో మరణించిన ఘటనలు ఇటీవల చోటు చేసుకొన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో  గత 24 గంటల్లో 10 వేలకు కరోనా కేసులు దాటాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 4,11,905కి చేరుకొన్నాయి. ఒక్క రోజులో కరోనాతో 52 మంది చనిపోయారు.రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 69,221కి చేరుకొన్నాయి.  కరోనాతో మరణాల రేటు 0.50శాతానికి చేరుకొన్నాయి.ఇంకా రాష్ట్రంలో 5474 మంది పరీక్షలు రావాల్సి ఉంది.ఆదిలాబాద్ జిల్లాలో 140, కొత్తగూడెంలో 174,జీహెచ్ఎంసీలో1440,జగిత్యాలలో 204, జనగామలో 160,భూపాలపల్లిలో101,కామారెడ్డిలో 279, కరీంనగర్ లో 369,ఖమ్మంలో 424, ఆసిఫాబాద్ 77, మహబూబ్‌నగర్ లో 417,మంచిర్యాలలో 195, మెదక్ లో 229,మల్కాజిగిరిలో 751,ములుగులో 79, నాగర్‌కర్నూల్ లో 257, నల్గొండలో469 లో కేసులు నమోదయ్యాయి.
 

Latest Videos


 

click me!