వ్యాక్సినేషన్ సక్సెస్.. తొలి రోజు 3,530 మందికి టీకా: తెలంగాణ హెల్త్ డైరెక్టర్

By Siva KodatiFirst Published Jan 16, 2021, 4:47 PM IST
Highlights

తెలంగాణలో తొలి రోజు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని ప్రకటించారు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యాక్సినేషన్ కోసం సిబ్బంది రెండు నెలలుగా శ్రమించారని తెలిపారు.

తెలంగాణలో తొలి రోజు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని ప్రకటించారు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యాక్సినేషన్ కోసం సిబ్బంది రెండు నెలలుగా శ్రమించారని తెలిపారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతమైందని శ్రీనివాసరావు ప్రకటించారు. కరోనా పోరాటంలో కేసీఆర్ ముందుండి నడిపించారని.. వ్యాక్సినేషన్ వేసుకున్న వారికి మొదటి డోసుతోనే పూర్తి రక్షణ దొరకదన్నారు.

కోవిడ్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలికితే వారికి కూడా మరోసారి వైరస్ సోకవచ్చని ఆయన చెప్పారు. 42 రోజుల తర్వాత వ్యాక్సిన్ నుంచి పూర్తి రక్షణ దొరుకుతుందని శ్రీనివాసరావు వెల్లడించారు.

Also Read:అందుకే నేను కరోనా టీకా తీసుకోలేదు: భావోద్వేగానికి గురైన ఈటెల రాజేందర్

తొలి రోజు దాదాపు 3,530 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని పేర్కొన్నారు. టీకా తీసుకున్న వారు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే 104కి ఫోన్ చేసి తెలపాలని ఆయన సూచించారు.

వ్యాక్సిన్ పూర్తిగా సేఫ్ అని తేలిందని... టీకా తీసుకున్న చోట 20 మందికి ఎర్రబడిందని, ఇది సమస్య కాదని శ్రీనివాసరావు ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆరోగ్యాన్ని ట్రాక్ చేస్తామని.. రేపు వ్యాక్సినేషన్‌కు సెలవు అని ఆయన చెప్పారు.

వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు అందరికీ రోల్‌మోడల్స్ అని హెల్త్ డైరెక్టర్ ప్రశంసించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి వచ్చే వారంలో టీకా వేస్తామని ఆయన వెల్లడించారు. 

click me!