తెలంగాణలో కరోనా కేసులపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం

By narsimha lodeFirst Published Mar 25, 2021, 4:28 PM IST
Highlights

తెలంగాణలో కరోనాపై వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు.
 

హైదరాబాద్: తెలంగాణలో కరోనాపై వైద్య ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు.రాష్ట్రంలో కరోనా కేసుల విషయమై అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ ఫోన్లో చర్చించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పెంచేందుకు ప్రత్యేక చర్యలు  తీసుకొంటుంది వైద్య ఆరోగ్య శాఖ.

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సంఖ్యను పెంచాలని కూడ నిర్ణయం తీసుకొన్నారు.   వచ్చే వారం నుండి 2 వేల సెంటర్లలో వ్యాక్సినేషన్ వేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ లలో 2 వేల సెంటర్లలో కరోనా వ్యాక్సిన్ వేస్తారు. ప్రతి రోజూ 50 వేల మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకొన్నారు.  పాజిటివ్ వచ్చిన వాళ్ల కాంటాక్ట్స్, ట్రేసింగ్ పై దృష్టి పెట్టింది. 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నందున విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేశారు. ఆన్ లైన్ లో విద్యార్ధులకు క్లాసులు నిర్వహిస్తున్నారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను  వ్యాక్సినేషన్ ఎక్కువ చేయాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు  నిర్ణయం తీసుకొన్నారు.

రాష్ట్రంలో కరోనా కేసుల పరిస్థితిపై పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మంత్రి ఈటల రాజేందర్ ను కలిసి వాకబు చేశారు. 

click me!