ప్రేమ నిరాకరణ: సిద్దిపేటలో వైద్య విద్యార్ధి ఆత్మహత్య

Published : Mar 25, 2021, 03:53 PM IST
ప్రేమ నిరాకరణ: సిద్దిపేటలో వైద్య విద్యార్ధి ఆత్మహత్య

సారాంశం

ప్రేమించిన అమ్మాయి  తన ప్రేమను నిరాకరించినందుకు గాను ఓ వైద్య విద్యార్ధి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో గురువారం నాడు  చోటు చేసుకొంది.

సిద్దిపేట: ప్రేమించిన అమ్మాయి  తన ప్రేమను నిరాకరించినందుకు గాను ఓ వైద్య విద్యార్ధి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో గురువారం నాడు  చోటు చేసుకొంది.రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామపరిధిలోని పీసీతండాకు చెందిన విద్యార్ధి సంతోష్ వైద్య విద్యను సిద్దిపేటలోని ప్రభుత్వ వైద్య కాలేజీలో అభ్యసిస్తున్నాడు.

గురువారం నాడు వార్షిక పరీక్షలకు సంతోష్  హాజరుకావాల్సింది. అయితే సంతోష్ మాత్రం పరీక్షలకు హాజరుకాలేదు.అయితే కాలేజీ అటెండర్ వెళ్లి సంతోష్ గదిలో చూస్తే సంతోష్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సంతోష్ మృతదేహం వద్ద సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 

ప్రేమించిన అమ్మాయి తనను తిరస్కరించడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకొన్నట్టుగా సంతోష్ ఆ లేఖలో రాశాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్