అమితాబ్ సినిమా ‘ఝూండ్’ పై స్టే కోరుతూ పిటిషన్.. పదిలక్షల జరిమానా విధించిన కోర్టు...

Published : Mar 05, 2022, 11:04 AM ISTUpdated : Mar 05, 2022, 11:07 AM IST
అమితాబ్ సినిమా ‘ఝూండ్’ పై స్టే కోరుతూ పిటిషన్.. పదిలక్షల జరిమానా విధించిన కోర్టు...

సారాంశం

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ నటించిన ‘ఝూండ్’ సినిమా విడుదలపై స్టే విధించాలంటూ ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. అతడు సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో దురుద్దేశంతోనే దీనికి పాల్పడ్డాడని .. పది లక్షల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

హైదరాబాద్ : హిందీ చిత్రం ‘Jhund’ విడుదలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై తెలంగాణ హైకోర్టు 10 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆటో బయోగ్రఫీ Amitabh Bachchan  ముఖ్యపాత్రలో నిర్మితమైన biographical sports film ఝుండ్. ఇది  ‘Slum Soccer’ అనే NGO వ్యవస్థాపకుడు Vijay Barse జీవితచరిత్ర ఆధారంగా నిర్మితమయ్యింది. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.

ఆ వ్యక్తికి విధించిన జరిమానా మొత్తాన్ని పిఎం covid-19 assistance fundకి నెల రోజుల్లోగా రూ.10 లక్షలు చెల్లించాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది.  అలా చేయడంలో విఫలమైతే, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అతని నుండి 30 రోజుల్లోగా ఆ మొత్తాన్ని రికవరీ చేసి, నిధికి జమచేస్తారని బెంచ్ తెలిపింది. నంది చిన్ని కుమార్ అనే పిటిషనర్, ఈ సినిమా నిర్మాణ హక్కులను తాను పొందానని, విడుదలపై స్టే విధించాలని కోరారు. అయితే ఆయన హైకోర్టులో చేసిన పిటిషన్‌పై కోర్టు రిజిస్ట్రీ నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి.

చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం, పిటిషన్‌ను కొట్టివేస్తూ, రిజిస్ట్రీ అభ్యంతరాలను సమర్థించింది. ఇదే అంశంపై కోర్టు అతను జిల్లాలో దాఖలు చేసిన కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకు అణిచివేసేందుకు ఎంచుకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఫిల్మ్ మేకర్స్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ఎల్ రవి చందర్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం, పిటిషనర్ క్లీన్ హ్యాండ్ తో కోర్టుకు రాలేదని పేర్కొంది.

ఇదిలా ఉండగా, అమితాబ్ ఝూండ్ సినిమా విషయంలో తన మంచి మనసును చాటుకున్నారు. తను నటిస్తన్న సినిమా ఆర్దిక పరిస్తితిని దృష్టిలో పెట్టుకుని రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్నారు. సినిమా రిలీజ్ అవ్వడం తనకు ముఖ్యం అన్నారు.

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబచ్చన్ ఫుట్ బాల్ కోచ్ గా నటించిన సినిమా  జుండ్. బిగ్ బీ ప్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈమూవీ నుంచి కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్  రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ సాధిచింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ తన పారితోషికాన్ని తగ్గించుకుని పెద్ద మనసు చూపారు. ఈ విషయాన్ని స్వయంగా ఈమూవీ ప్రొడ్యూసర్ సందీప్ సింగ్ వెల్లడించారు.

జుండ్ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే డబ్బుల విషయంలో టైట్ అయ్యి నిర్మాతలు బడ్జెట్ కు సంబంధించి ఇబ్బంది పడుతున్నట్టు అమితాబ్ తెలుసుకున్నారు. దీంతో తన  రెమ్యూనరేషన్ ను తగ్గించుకోవడం కోసం ఆయన రెడీ అయ్యారు. బిగ్ బీ కి ఫుట్ బాల్  అంటే చాలా ఇష్టం. తనకు ఇష్టమైన ఆటకు సంబంధించిన సినిమాలో నటించడం.. ఆసినిమా కష్టంలో ఉండటంతో అమితాబ్ సహాయం చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. అమితాబ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను ఎంతో ఇష్టపడినట్టు సందీప్ సింగ్ తెలిపారు. నచ్చిన సినిమా కావడంతో నిర్మాతల కష్టాలను గుర్తించిన అమితాబ్ ఆ ఆఫర్ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu