రవిప్రకాష్‌కు ఊరట: ఈడీ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు

By narsimha lodeFirst Published Jul 17, 2020, 1:03 PM IST
Highlights

ఈడీ కేసులో టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు తెలంగాణ హైకోర్టు శుక్రవారంనాడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

హైదరాబాద్: ఈడీ కేసులో టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు తెలంగాణ హైకోర్టు శుక్రవారంనాడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

రవిప్రకాష్ సహా మరో ఇద్దరు టీవీ9 మాతృ సంస్థగా ఉన్న అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుండి 2018 సెప్టెంబర్ నుండి 2019 మే వరకు రూ. 18 కోట్ల నిధులను అనుమతులు లేకుండా ఉపసంహరించినట్టుగా ఆ సంస్థ ప్రతినిధులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ విషయమై 2019 అక్టోబర్ లో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ  అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్పర్మేషన్ రిపోర్టును నమోదు చేశాయి. 

ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఉండాలని కోరుతూ రవిప్రకాష్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.  ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు రవిప్రకాష్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

రూ. లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ప్రతి శనివారం నాడు ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని షరతు విధించింది. దర్యాప్తు కొనసాగించవచ్చని ఈడీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది.

click me!