తెలంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రారంభం

By narsimha lode  |  First Published Oct 16, 2022, 12:28 PM IST

తెలంగాణలోగ్రూప్ 1 ప్రిలిమినరీ  పరీక్షలు ఆదివారంనాడు ప్రారంభమయ్యాయి.503 పోస్టులకు గాను  పరీక్షలు నిర్వహిస్తుంది టీఎస్‌పీఎస్‌సీ.3.90లక్షల మందిఈ పరీక్షల కోసం ధరఖాస్తు  చేసుకున్నారు.
 


హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ఆదివారం నాడు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

రాష్ట్రంలోని 503 పోస్టులను భర్తీ చేసేందుకు  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తుంది.ఉదయం 10:15 గంటలు దాటిన తర్వాత  పరీక్ష కేంద్రంలోకి అభ్యర్ధులను అమనుతించలేదు.ఈ  పరీక్షకు 3.90లక్షల మంది ధరఖాస్తు  చేసుకున్నారు.గ్రూప్ 1 పరీక్షల కోసం 1019    పరీక్షా కేంద్రాలను ఏర్పాటు  చేశారు.  503 గ్రూప్ 1  పోస్టులకుగాను 2,28,809 పురుషులు,1,51,228 మహిళ అభ్యర్ధులు ధరఖాస్తు  చేసుకున్నారు.

Latest Videos

44మందిట్రాన్స్ జెండర్లు కూడ గ్రూప్ 1 పరీక్షల కోసం ధరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిగ్రూప్ 1 నోటిఫికేషన్ ఇది.ఏపీ  ప్రభుత్వం 2011లో 312 గ్రూప్ పోస్టులకునోటిఫికేషన్  జారీ చేసింది.గ్రూప్ 1  పరీక్షల్లో  రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసిన విషయం తెలిసిందే.తెలుగు ,ఇంగ్లీష్,ఉర్ధూ భాషల్లో  ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 121  ఎండీఓ,91డీఎస్పీ,48 కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు,42 డిప్యూటీ కలెక్టర్లు,41మున్సిపల్ కమిషనర్లు, 40 అసిస్టెంట్  ఆడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం.

click me!