హరికృష్ణ విషయంలో... మరో అడుగు ముందుకేసిన తెలంగాణ ప్రభుత్వం

By ramya neerukondaFirst Published Aug 30, 2018, 3:26 PM IST
Highlights

ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పడంతో వేదికను మార్చారు. జూబ్లీహిల్‌లో మహాప్రస్థానం అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన కుటుంబసభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించారు.

సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అకాల మరణం అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది. కాగా.. ఈ రోజే ఆయన అంత్యక్రియలు. ఇప్పటికే ఆయన అంతిమ యాత్ర ప్రారంభమైంది.  అయితే...హరికృష్ణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

అంతేకాకుండా జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలాన్నికేటాయించింది. అంత్యక్రియలు ముగిశాక కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు స్మారక చిహ్నం నిర్మించే అవకాశం ఉంది.
 
మహా ప్రస్థానంలో‌ నందమూరి హరికృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన అంత్యక్రియలను మొయినాబాద్‌లో ఫాం హౌస్‌లో నిర్వహించాలని కుటంబసభ్యులు అనుకున్నారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరాం అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పడంతో వేదికను మార్చారు. జూబ్లీహిల్‌లో మహాప్రస్థానం అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన కుటుంబసభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించారు.
 

click me!