టెన్త్ పరీక్షలకు తెలంగాణ తొందర: హైకోర్టులో కౌంటర్ దాఖలు

By telugu team  |  First Published May 15, 2020, 11:59 AM IST

రాష్ట్రంలో ఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతి పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అనుమతి ఇవ్వాలని విజ్ఢప్తి చేసింది.


హైదరాబాద్:  రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎస్ఎస్సీ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసింది.

ఎస్ఎస్సీ పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్ ను అత్యవసరంగా వినాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టెన్త్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కూడా విజ్ఢప్తి చేసింది. వైద్యుల సలహాలు తీసుకుని పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. ఈ నెల 19వ తేదీ తర్వాత విచారణ చేపడుతామని హెకోర్టు తెలిపింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలని ప్రభు్తవం ఆలోచన చేస్తోంది.

Latest Videos

undefined

ఇదిలావుంటే, పదవ తరగతి పరీక్షల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరు పేపర్ల పరీక్షలు ఆరు రోజులు జరుగుతాయి.

ఒక్కో పేపర్ కు వంద మార్కులు ఉంటాయి. భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షల షెడ్యూల్ ఈ కింది విధంగా ఉంది.

జులై 10వ తేదీన ఫస్ట్ లాంగ్వెజ్
జులై 11ల తేదీన సెకండ్ లాంగ్వెజ్
జులై 12వ తేదీన ఇంగ్లీష్
జులై 13వ తేదీన మాథమెటిక్స్
జులై 14వ తేదీన జనరల్ సైన్స్
జులై 15వ తేదీన సోషల్ సైన్స్ 

click me!