కుల‌వృత్తులు, చేతివృత్తుల‌కు రూ.1 ల‌క్ష ఆర్థిక సాయం.. ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం.. అప్లై చేసుకోండిలా..

By Rajesh KarampooriFirst Published Jun 7, 2023, 2:30 AM IST
Highlights

వెనుక‌బ‌డిన వ‌ర్గాల కులవృత్తులు, చేతివృత్తుల‌కు రూ. ల‌క్ష ఆర్థిక సాయం అందించే ప్ర‌క్రియ మొద‌లైంది. ఇందుకోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ప్రారంభించారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న కుమ్మరి, కమ్మరి, మంగళి, చాకలి, మేదరి వంటి కులాల వారిని ఆదుకొనేందుకు రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని గ‌త నెల‌లో జ‌రిగిన‌ కేబినెట్‌లో నిర్ణయించిన  విష‌యం తెలిసిందే.  అయితే.. ఇందుకు సంబంధించిన విధివిధానాలను వేగంగా రూపొందించి, లబ్ధిదారులను ఎంపిక చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. 

ఈ నేప‌థ్యంలో దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభమైంది. ఈ పథకం అమలు కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ https://tsobmmsbc.cgg.gov.in ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ప్రారంభించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్థికసాయం పంపిణీ చేసేందుకు అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని జూన్ 9న  సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల‌చే ల‌బ్దిదారుల‌కు ల‌క్ష రూపాయాలను పంపిణీ చేయ‌నున్నారు.

సబ్ కమిటీ

కులవృత్తుల ఆధారపడి జీవిస్తున్న వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు విధివిధానాల రూపకల్పన చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో సబ్ కమిటీ  ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ కమిటీలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్ కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పథకం అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. మార్గదర్శకాలకు సంబంధించిన జీవోను మంగళవారం జారీ చేశారు.
 
అర్హతలు

>> జూన్ 2, 2023 నాటికి 18 నుంచి 55 ఏళ్ల వయస్సు లోపు వారు అర్హులు

>> ఆర్థిక సాయం పొందాలనుకునే వారు గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్ధిక సాయం పొందకూడదు. పొందిన వారు అనర్హులు.  

>> అభ్యర్థుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1 లక్ష 50 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు ఉండాలి.

>> పై అర్హతులు ఉన్నవారు https://tsobmmsbc.cgg.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

>> దరఖాస్తుల స్వీకరణ జూన్ 6 నుంచి 20 వరకు 

>> ఫోటో, ఆధార్, కుల ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. 

>> ఆన్‌లైన్‌లో వచ్చిన అప్లికేషన్లను మండలంలో ఎంపిడిఓ, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో (ఈనెల 20 నుంచి 26వరకు) పరిశీలన చేసి కలెక్టర్‌కు నివేదికను సమర్పిస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అప్రూవ్‌ చేసిన అనంతరం అర్హుల జాబితాను వెబ్ సైట్ లో పొందుపర్చుతారు. కులవృత్తి, చేతివృత్తులకు సంబందించిన పనిముట్లు, ముడిసరకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం అందించ‌నున్నారు.

 

click me!