సీఎం కేసీఆర్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు.. 

By Rajesh KarampooriFirst Published Apr 30, 2023, 4:54 PM IST
Highlights

Telangana Secretariat: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ ప్రారంభోత్సవం వేళ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తీరు పైన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. 

Telangana Secretariat: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయాన్ని (Secretariat) సీఎం కేసీఆర్‌ (CM KCR) నేడు ప్రారంభించారు. నూతన సచివాలయంలో ఆరో అంతస్తులో సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వెళ్లిన సీఎం కేసీఆర్ సుముహూర్తంలో తన కుర్చీలో ఆసీనులయ్యారు. తొలి సంతకాన్ని ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ సహా ఆరు ఫైళ్లపై చేశారు. అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత మంత్రులు తమ చాంబర్లలో ప్రత్యేక పూజలు చేసి.. కూర్చీలో 
ఆసీనులయ్యారు. తమ శాఖలకు సంబంధిత ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు.  

ఇదిలాఉంటే.. సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తీరు పైన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇతర నాయకుల ఆనవాళ్లు లేకుండా చేసేందుకే సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మించారనీ,  తన వ్యక్తిగత ప్రతిష్ఠ కోసమే సీఎం ప్రజల ధనాన్ని వ్రుద్ధా చేసి.. నూతన సచివాలయాన్ని నిర్మించారని విమర్శించారు. తెలంగాణలో ఎన్నికలు జరగాల్సిన సమయంలోనైనా..సీఎం కేసీఆర్ రోజూ సచివాలయానికి వెళ్తారా? అని నిలదీశారు. కొత్త సచివాలయంలో నుంచి అయినా.. పాలన బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు. నూతన సచివాలయ నిర్మాణం కోసం శ్రమించిన కార్మికులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానని ఈటల అన్నారు. కేసీఆర్ పాలనలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్థగా మారాయని అన్నారు.  

Latest Videos

అంతకుముందు తడిసిన ధాన్యం విషయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పైన, మంత్రులు విమర్శలు గుప్పించారు. రైతుల పరిస్థితులను అర్థం చేసుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందనీ,  ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో రైతన్నలు కన్నీరుమున్నీరవుతుంటే.. వారిని పరామర్శించేందుకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు తీరిక లేకుండా పోయిందనీ, సచివాలయ ప్రారంభోత్సవ సంబరాలలో మునిగి తేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వరి ధాన్యం మీద 600 గ్రాములు కంటే ఎక్కువ ఎందుకు  కట్ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కొనుగోలు సెంటర్లలో ఎక్కడ ముందస్తు ఏర్పాట్లు చేయలేదని, తీవ్రంగా పంట నష్టం కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారనీ, కానీ,కెసిఆర్ మాత్రం నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కేసీఆర్ కు ఉన్న ప్రేమకు గుర్తుగానే సచివాలయాన్ని కట్టారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.

click me!